Begin typing your search above and press return to search.

ఈ రోజే 'సంపూర్ణ చంద్రగ్రహణం'.. ప్రత్యేకత ఏమిటంటే !

By:  Tupaki Desk   |   26 May 2021 4:30 AM GMT
ఈ రోజే సంపూర్ణ చంద్రగ్రహణం.. ప్రత్యేకత ఏమిటంటే !
X
ఈ రోజు రోదసి ప్రియులకు ఆకాశంలో సంపూర్ణ చంద్రగ్రహణం కనువిందు చేయబోతోంది. అయితే, భారత్‌ లో మాత్రం పాక్షిక చంద్రగ్రహణమే కనువిందు చేయనుంది. ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్‌ లో కొన్ని ప్రాంతాలు, ఒడిశా, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో తీర ప్రాంతాల్లో చంద్రగ్రహణం కనిపిస్తుందని ఎర్త్‌ సైన్సెన్స్‌ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.15 గంటలకు మొదలయ్యే గ్రహణం 6.23 గంటలకు ముగియనుంది. చంద్రుడు నేడు ‘సూపర్ బ్లడ్‌మూన్’గా దర్శనమివ్వనున్నాడు. అంటే చందమామ నేడు రక్తపు ముద్దలా దర్శనమిస్తుంది.

నాసా ప్రకారం.. పూర్తి గ్రహణం.. అమెరికా, కెనడా, మెక్సికో, సెంట్రల్ అమెరికాలోని చాలా ప్రాంతాలు, ఈక్వెడార్, పశ్చిమ పెరు, దక్షిణ చిలీ, అర్జెంటినా దేశాల్లో కనిపిస్తుంది. మన దేశంలోని అగర్తల, ఐజ్వాల్, కోల్‌ కతా, చిరపుంజి, కూచ్ బెహర్, డైమండ్ హార్బర్, దిఘా, గువాహటి, ఇంఫాల్, ఇటానగర్, కోహిమా, లుమ్డింగ్, మాల్దా, నార్త్ లఖిమ్‌పూర్, పారాదీప్, పాశీఘాట్, పోర్ట్ బ్లెయిర్, పూరి, షిల్లాంగ్ తదితర ప్రాంతాలతోపాటు నేపాల్, పశ్చిమ చైనా, మంగోలియా, తూర్పు రష్యాలలో గ్రహణం పాక్షికంగా కనిపించనుంది. తిరిగి ఈ ఏడాది నవంబరు 19న భారత్‌లో చంద్రగ్రహణం కనిపిస్తుంది. కాగా.. బ్లడ్‌మూన్‌, సంపూర్ణ చంద్ర గ్రహణం కలిసిరావడం ఈ గ్రహణంలో ప్రత్యేకత.