Begin typing your search above and press return to search.
సూపర్ ఐడియా.. ఇక నో ‘బ్యాట్స్‌మన్’.. ఓన్లీ బ్యాటర్
By: Tupaki Desk | 23 Sep 2021 4:38 AM GMTసుపరిచితమైన ‘బ్యాట్స్‌మన్’ మాట వినిపించదు. ఆ మాటకు వస్తే.. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ మాటను వినియోగిస్తే తప్పుగా వాడినట్లేనని చెప్పాలి. ఆటలో లింగ వివక్ష పనికి రాదని.. బ్యాట్స్‌మన్ పదంలో పురుషులన్న మాట కనిపిస్తుంది. మగవాళ్లను బ్యాట్స్‌మన్ అంటున్నారు సరే.. మరి మహిళల్ని ఏమనాలి? అన్న ప్రశ్న కొంతకాలంగా వినిపిస్తున్నదే.
తాజాగా దీనికి పరిష్కారాన్ని చూపించేశారు. ఇకపై బ్యాట్స్‌మన్ స్థానంలో బ్యాటర్ అనే పదాన్ని వినియోగించనున్నారు. దీంతో.. లింగ వివక్షకు తావు ఉండదు. ఆటల్లో లింగ వివక్ష ఉండరాదని.. సాంకేతిక పదాల్లో కూడా అలాంటి ధోరణికి చెక్ పెట్టాలన్న సదుద్దేశ్యంతో ఈ నిర్ణయాన్ని తసీుకున్నారు.
దీంతో.. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ నిబంధనల్ని రూపొందించే మెరిలిబోన్ క్రికెట్ క్లబ్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. క్రికెట్ లో కీలకమైన బ్యాట్స్‌మన్ పదానికి బదులుగా బ్యాటర్ అనే పదాన్ని వినియోగించాలని కోరింది. ఆడ.. మగ అన్న తేడా లేకుండా అందరికి సరిపోయేలా ఈ పదాన్ని రూపొందించారు. కాస్త ఆలస్యంగా తీసుకున్నా.. సరైన నిర్ణయాన్ని తీసుకున్నారని చెప్పాలి. ఆ ఆలోచన చేసిన వారిని అభినందించాల్సిందే.