Begin typing your search above and press return to search.
మహేష్ బాబుకు టీడీపీ కౌంటర్ ఎవరో?
By: Tupaki Desk | 14 Aug 2017 9:19 AM GMTఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. నంద్యాల రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోంది. క్రమంగా నంద్యాల ఉప ఎన్నిక సినీముద్రను కూడా పులుముకుంటోంది. ఇప్పటిదాకా వైసీపీ ప్రచారంలో రోజా కీలకంగానే ఉన్నప్పటికీ.. ఆమెను పూర్తిస్థాయి సినీ నటిగా పరిగణించడానికి లేదు. ఆమె మెజారిటీ రాజకీయ నాయకురాలి హోదాలోనే అక్కడ పనిచేస్తున్నారు. అయితే.. తాజాగా మహేష్ బాబు అభిమానులు వైసీపీకి మద్దతు ఇవ్వడంతో ఎన్నికల ప్రచారం సినీ హంగులు అద్దుకున్నట్లు అవుతోంది. అయితే యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న స్టార్ మహేష్ బాబుకు దీటుగా.. యూత్ ను ఆకట్టుకునేలా తెలుగుదేశం తరఫున ప్రచారపర్వానికి మద్దతు తెలియజేసే వాళ్లంటూ ఎవరైనా ఉన్నారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మహేష్ బాబాయి.. ఆదిశేషగిరిరావు.. సోమవారం నాడు నంద్యాలలో మహేష్ బాబు అభిమానులతో సమావేశం అయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. మహేష్ అభిమానులంతా కూడా.. వైసీపీ తరఫు ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొనడానికి కూడా అంగీకరించారు. మొత్తానికి ఆ రకంగా తమ ప్రచారానికి సినీ హంగులను వైసీపీ తీసుకువచ్చింది. ఈ విషయంలో తెలుగుదేశం వెనుకబడే ఉందని చెప్పాలి.
నిజానికి తెలుగుదేశానికి సినిమా రంగంలో మద్దతుదారులు చాలా మందే ఉన్నప్పటికీ యూత్ లో క్రేజ్ ఉన్న వారు ప్రచారానికి వచ్చేది ఎవరు, లేదా కనీసం తమ అభిమానులకు పిలుపు ఇచ్చేది ఎవరు అనేది అనుమానమే? ఎందుకంటే.. జూ.ఎన్టీఆర్ పార్టీ వ్యవహారాలకు దూరంగానే ఉన్నారు. ఆయనను పిలవడం కూడా తెదేపాలో చాలామంది పెద్దలకు ఇష్టం లేదు. ఇక పోతే పవన్ కల్యాణ్ తెలుగుదేశానికి మద్దతుగా సాధారణ సందర్భాల్లో మాట్లాడుతుంటాడే తప్ప.. ఎన్నికల్లో తెదేపాకు ఓటు వేయాల్సిందిగా మళ్లీ చెప్పడానికి ఇష్టపడడం లేదు. ఇక బాలకృష్ణ విషయానికి వస్తే.. నంద్యాలలో ఎన్నికల ప్రచారం గురించి ఇంకా ఏమీ నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు. తెలుగుదేశం పరిస్థితి ఇలా ఉంది... మరి యూత్ లో సినీజీవులను ఆకట్టుకోవడానికి తెదేపా ఎలాంటి పాట్లు పడుతుందో చూడాలి.