Begin typing your search above and press return to search.
సూపర్ స్టార్.. బీజేపీకి సపోర్ట్ చేసినట్టే!
By: Tupaki Desk | 10 April 2019 6:30 AM GMTభారతీయ జనతా పార్టీ పట్ల తన అభిమానాన్ని దాచుకోలేకపోతున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. పోలింగ్ కు సమయం ఆసన్నం అయిన వేళ ఆయన స్పందిస్తూ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ దేశంలో నెగ్గితే.. నదుల అనుసంధానానికి ప్రాధాన్యతను ఇస్తుందంటూ రజనీ కాంత్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి.
కొన్నాళ్ల కిందట తను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినట్టే అని ప్రకటించారు రజనీకాంత్. సొంతంగా పార్టీ విషయంలో పలు సమావేశాలు నిర్వహించారు. అభిమాన సంఘాలను రాజకీయం వైపు నడిపించేందుకు సమాయత్తం అయ్యారు. రజనీకాంత్ పార్టీ గుర్తు విషయంలో కూడా చర్చ జరిగింది. అయితే దూకుడుగా రాజకీయాల వైపు రాలేకపోయాడు రజనీకాంత్.
ఇక ప్రస్తుత లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో తన పార్టీ పోటీలో ఉండదని కొన్నాళ్ల కిందట రజనీకాంత్ స్పష్టం చేశారు. తన పార్టీ భవిష్యత్తులో పోటీ చేస్తుందని కూడా చెప్పలేదు కానీ, లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో పోటీలో ఉండదని మాత్రం రజనీకాంత్ స్పష్టం చేశారు.
అలాగే తన మద్దతు ఎవరికీ లేదని రజనీకాంత్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో తన ఫొటోను కానీ, తన మద్దతు ఉందంటూ ఎవరైనా ప్రచారం చేస్తే సహించేది లేదని రజనీకాంత్ వ్యాఖ్యానించారు కూడా. అలా సీరియస్ గా హెచ్చరించిన ఆయన..తీరా పోలింగ్ వేళ మాత్రం బీజేపీకి అనుకూలంగా మాట్లాడటం విశేషం.
'బీజేపీకి అధికారం దక్కితే నదుల అనుసంధానానికి ప్రాధాన్యతను ఇస్తుంది. అది మాజీ ప్రధాని ఏబీ వాజ్ పేయి కల. ఆ విషయం గురించి ఆయన ఎంతగానో తపించారు. నదుల అనుసంధానం బీజేపీకే సాధ్యం..' అన్నట్టుగా రజనీకాంత్ వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలతో సూపర్ స్టార్ కమలం పార్టీకి మద్దతు పలికినట్టే అని, బీజేపీ మద్దతుదారుగా నిలిచినట్టే అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.