Begin typing your search above and press return to search.
బ్రహ్మోస్ మరోసారి తన సత్తాను చూపించింది
By: Tupaki Desk | 17 July 2018 9:42 AM GMTశాస్త్రసాంకేతిక రంగాల్లో మనం వెనుకబడే ఉన్నాం. ఇప్పటికి ప్రాశ్చాత్యదేశాలు అభివృద్ధి చేసిన టెక్నాలజీని అరువు తెచ్చుకొని.. మనకు తగ్గట్లుగా కొన్నిమార్పులు తెచ్చుకోవటం చేస్తున్నాం. మనం అంత గొప్ప.. ఇంత గొప్ప అని పాలకులు గొప్పలు చెప్పుకోవటమేకాదు.. పరిశోధనల మీద మనం చేస్తున్న ఖర్చు చాలా తక్కువ.
అయితే.. ప్రభుత్వం ఇస్తున్నకొద్దిపాటి నిధులను కొన్ని సంస్థలు పొదుపుగా వాడుతూ.. ఎక్కడా వృధా కాకుండా రూపాయి నాలుగు రూపాయిల ఫలితాన్ని అందిస్తున్నారు. అలాంటి వారి పుణ్యమా అని తరచూ భారత్ ప్రపంచ వేదికల మీద తన సత్తాను చాటుతోంది.
తాజాగా అలాంటిదే బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి వ్యవహారంగా చెప్పాలి. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్రూయిజ్ క్షిపణిగా దీనికి పేరుంది. ఒడిశాలోని బాలాసోర్ ననుంచి ప్రయోగించిన ఈ క్షిపణి విజయవంతంగా తన లక్ష్యాన్ని చేరుకుంది. బ్రహ్మోస్ జీవితకాల పొడిగింపు కార్యక్రమంలో భాగంగా ఈ పరీక్షల్ని నిర్వహించారు. తాజా పరీక్ష విజయవంతం కావటంతో శాస్త్రవేత్తలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. 290 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించే సత్తా ఉన్న ఈ క్షిపణి నేల.. నింగి.. సముద్రం నుంచి ప్రయోగించే అవకాశం ఉంది.
భారత్‌కు వ్యూహాత్మక ఆస్తిగా ఈ క్షిపణిని అభివర్ణిస్తారు. దేశానికి చైనా.. పాక్ నుంచి ఉన్న ముప్పు దృష్ట్యా ఈ క్షిపణి సమర్థంగా రక్షణ కల్పిస్తుందన్న వాదన ఉంది. తాజా పరీక్షలో అన్ని వ్యవస్థలు సక్రమంగా పని చేయటంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అన్నిరకాల వాతావరణ పరిస్థితుల్లోనూ బ్రహ్మోస్ తన సత్తాను చాటుతుందన్న విషయం తాజా పరీక్షతో మరోసారి రుజువైందని చెప్పక తప్పదు.