Begin typing your search above and press return to search.
కేసీఆర్ పై ‘సూపర్ స్టార్’ షాకింగ్ పొగడ్తలు
By: Tupaki Desk | 13 July 2016 11:01 AM IST పొగిడితే కూడా షాక్ అవుతారా? అన్న డౌట్ రావొచ్చు. కానీ.. అలనాటి సూపర్ స్టార్ గా సుపరిచితులు.. ఇప్పటికీ తన వీరాభిమానుల చేత ‘సూపర్ స్టార్’ అంటూ పిలిపించుకునే ఒకే ఒక్క నటుడు కృష్ణ. అలాంటి సూపర్ స్టార్ కృష్ణ ఎప్పుడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను విపరీతంగా పొగిడేశారు. నిజానికి ఆయన పొగిడిన పొగడ్తలు వింటే.. కేసీఆర్ ను అమితంగా ఆరాధించే వారు సైతం సిగ్గు పడాల్సిందే.
తాము సైతం పొగడనంత భారీగా తమ అధినేతను పొగిడినందుకు కేసఆర్ వీరాభిమానులు ఫీల్ అవుతారేమో. ఇంతకీ అంత ఎక్కువగా తెలంగాణ ముఖ్యమంత్రిని పొగిడారంటే.. ‘నాడు అశోకుడు రోడ్ల పక్కన చెట్లు నాటించనట్లు చరిత్రలో చదువుకున్నామని.. నేడు తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ అందరితో అంతటా మొక్కలు నాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు’ అంటూ పొగిడేశారు.
అప్పుడు అశోకుడు.. ఇప్పుడు కేసీఆర్ అన్నట్లుగా పొగిడిన పొగడ్త ఎవరు మాత్రం పొగిడారు చెప్పండి. పద్మాలయ భూముల వ్యవహారంతో ఉన్న భయ భక్తులో లేక.. హరితహారం పేరిట కేసీఆర్ షురూ చేసిన కార్యక్రమం మీద మమకారమో కానీ.. కృష్ణ పొగడ్తలు మాత్రం షాకింగ్ గా మారాయి. ఇప్పటివరకూ ఎంతోమంది ముఖ్యమంత్రులున్నా.. ఎవరిని పొగడనంత భారీగా కేసీఆర్ ను అలనాటి సూపర్ స్టార్ పొడగటం గమనార్హం.