Begin typing your search above and press return to search.

బ్రూ ప్యాకెట్లలో డ్రగ్స్ సరఫరా.. ప్యాకెట్ ఎంతంటే?

By:  Tupaki Desk   |   26 May 2022 5:21 AM GMT
బ్రూ ప్యాకెట్లలో డ్రగ్స్ సరఫరా.. ప్యాకెట్ ఎంతంటే?
X
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలంటారు. ఇప్పుడు కేటుగాళ్లు డ్రగ్స్ దందాలో కొత్త పోకడలు అవలంభిస్తున్న దొరకకుండా డ్రగ్స్ ను మూడు పువ్వులు, ఆరు కాయలుగా అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. వినూత్న ఐడియాలతో డ్రగ్స్ సరఫరాను చేస్తున్నారు.

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ పట్టుబడ్డాయి. ధూల్ పేటలో కొకైన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరు డ్రగ్ పెడ్లర్లతోపాటు ఒక ఆఫ్రికా దేశస్థుడిని అరెస్ట్ చేశారు. డ్రగ్స్ ను తరలించేందుకు వాడుతున్న ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నారు.

ఆఫ్రీకన్ దేశస్థుడు, సందీప్ అనే వ్యక్తికి డ్రగ్స్ అమ్ముతుండగా పురానా పూల్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. హోండా యాక్టివాను పట్టుకోగా అందులో 7 గ్రాముల కొకైన్ దొరికినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయ్ తెలిపారు. ఆఫ్రికా దేశస్థుడు ఇచ్చిన సమాచారంతో మరో వ్యక్తిని కూడా పట్టుకున్నట్లు వెల్లడించారు.

అతడి కారులో 11 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సన్ సిటీలో నివాసం ఉంటున్న ఆఫ్రికా వ్యక్తి ఇంట్లో సోదాలు నిర్వహించామని తెలిపారు. అక్కడ మరో 38 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ తెలిపారు. మొత్తంగా 56 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

ఆఫ్రికన్ వ్యక్తి వనస్థలిపురంతోపాటు సన్ సిటీ నుంచి సప్లై చేస్తున్నట్లు అధికారులు కనుక్కున్నారు. బ్రూ కాఫీ ప్యాకెట్లలో ఎవరికీ అనుమానం రాకుండా అందులో ఉంచి కొకైన్ విక్రయిస్తున్నట్లుగా అధికారులు తేల్చారు. ఒక్కో ప్యాకెట్ లో ఒక్కో గ్రామ్ కొకైన్ ను సరఫరా చేస్తున్నట్లు వెల్లడైంది.

పాత వాళ్లకి ఐదువేలు.. కొత్త వాళ్లకు రూ.6వేల చొప్పున విక్రయిస్తున్నాడని.. ఢిల్లీ నుంచి తీసుకువచ్చి ఇక్కడ అమ్ముతున్నాడని అధికారులు తెలిపారు. సదురు ఆఫ్రికన్ వ్యక్తి ఫార్మసీ స్టూడెంట్ వీసాతో వచ్చాడని అధికారులు తెలిపారు.ఒక మసాలా కంపెనీ వాళ్లకు చెందిన యజ్ఞానంద్ ఇన్నోవా కారులో తరలిస్తున్న క్రమంలో అధికారులు పట్టుకున్నారు. యజ్ఞానంద్ చార్మినార్ లో నివాసం ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. యజ్ఞానంద్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. గతంలో కూడా ఓ కేసులో అరెస్ట్ అయిన నాలుగు నెలల తర్వాత బెయిల్ పై విడుదలయ్యాడు.