Begin typing your search above and press return to search.
నీట్ లో మార్పులు .. కేంద్రంపై సుప్రీం ఆగ్రహం!
By: Tupaki Desk | 28 Sep 2021 5:30 AM GMTనీట్ పీజీ పరీక్షల సిలబస్ మార్పుల పై దేశ అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీం కోర్టు కేంద్రాన్ని తప్పుబట్టింది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ సూపర్ స్పెషాలిటీ ఎగ్జామ్ 2021 పరీక్షల ప్యాటర్న్ లో చివరి నిమిషంలో మార్పులు చేసింది కేంద్ర ప్రభుత్వం. దీనిపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. యువ వైద్యులను ఫుట్ బాల్ లా చూడొద్దంటూ మండిపడింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు నీట్ పీజీ సూపర్ స్పెషాలిటీ ఎగ్జామ్ 2021 (NEET SS 2021) సిలబస్ లో మార్పులకు కారణమైన నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (NBE), నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) పైనా సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
సున్నితత్వం లేని అధికారుల దయపై యువ వైద్యులు ఉండలేరని, యువ డాక్టర్లను ఫుట్ బాల్ లా భావించకూడదని సుప్రీం కోర్టు న్యాయమూర్తులైన డీవై చంద్రచూడ్, బీవీ నాగరత్న ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్ పీజీ సూపర్ స్పెషాలిటీ ఎగ్జామ్ 2021 నవంబర్ 13, 14 తేదీల్లో ఉంది. ఈ పరీక్ష తేదీలను జూలై 23న ప్రకటించింది బోర్డు. కానీ ఆగస్ట్ 31న సిలబస్ లో మార్పులు చేశారు. ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సిలబస్ మార్చడమేంటని, ఆ మార్పులేవో వచ్చే ఏడాది చేయొచ్చు కదా అని జస్టిస్ చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. విద్యార్థులు ఈ పరీక్షల కోసం కొన్ని నెలలుగా ప్రిపేర్ అవుతుంటారని, తాము అధికారుల తీరుపై అసంతృప్తిగా ఉన్నామన్నారు. మీకు అధికారం ఉంది కదా అని ఇలా అధికారం చెలాయిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖతో మాట్లాడి దీనిపై నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు.
జస్టిస్ డివై చంద్రచూడ్ మాట్లాడుతూ ప్రభుత్వం యువ వైద్యులతో సున్నితత్వంతో వ్యవహరించాలని అన్నారు. నేషనల్ మెడికల్ కమిషన్ ఏమి చేస్తోంది, మీరు నోటీసు జారీ చేసి, ఆపై నమూనాను మార్చుతారా, విద్యార్థులు నెలలు ముందుగానే సూపర్ స్పెషాలిటీ కోర్సులకు సిద్ధమవుతారు. పరీక్షకు ముందు చివరి నిమిషాలలో నమూనా మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇదే పనిని వచ్చే సంవత్సరం చేయవచ చ్చు కదా వచ్చే ఏడాది మార్పులతో ఎందుకు ముందుకు సాగలేరు.
ప్రభుత్వం NEET PG సూపర్ స్పెషాలిటీ ఎగ్జామ్ 2021 సిలబస్‌ని పరీక్షకు 2 నెలల ముందు మార్చారని విద్యార్థులు పేర్కొన్నారు. దీనికి వ్యతిరేకంగా, 41 మంది పీజీ అర్హత కలిగిన వైద్యులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.2018 లో నమూనా జనరల్ మెడిసిన్ నుండి 40%, సూపర్ స్పెషాలిటీ నుండి 60% అని విద్యార్థులు పేర్కొన్నారు, అయితే ఈసారి చివరి నిమిషంలో దానిని మార్చారు. ఇందులో జనరల్ మెడిసిన్ నుంచి మొత్తం 100% ప్రశ్నలు అడిగారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ PG సూపర్ స్పెషాలిటీ ఎగ్జామినేషన్ -2021, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సిలబస్ లో చివరి నిమిషంలో మార్పులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సెప్టెంబర్ 20 న సుప్రీం కోర్టు నోటీసు జారీ చేసింది.