Begin typing your search above and press return to search.

అయోధ్య తీర్పు : మధ్యవర్తుల పై ప్రశంసలు కురిపించిన సుప్రీం

By:  Tupaki Desk   |   9 Nov 2019 7:29 AM GMT
అయోధ్య తీర్పు : మధ్యవర్తుల పై ప్రశంసలు కురిపించిన సుప్రీం
X
గత కొన్ని శతాబ్దాలుగా దేశంలో ప్రధాన కేసుగా ఉన్న అయోధ్య-బాబ్రీ మసీదు భూ వివాదం కి సుప్రీంకోర్టు నేడు ఒక ముగింపు పలికింది. అయోధ్యలోని రామజన్మ భూమి- బాబ్రీ మసీదు కేసులో ఆ వివాదస్పదమైన స్థలమైన 2.77 ఎకరాల భూమి రామజన్మ భూమి న్యాస్‌కే చెందుతుందని సుప్రీం స్పష్టం చేసింది. ముస్లింలకు మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయంగా ఐదెకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించాలని తెలిపింది.

ఈ క్రమంలో ఎంతో సున్నితమైన ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేసిన మధ్యవర్తుల కమిటీని కూడా సుప్రీం ప్రశంసించింది. అయోధ్య రామ జన్మభూమి - బాబ్రీ మసీదు వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించేందుకు కృషి చేసిన ముగ్గురు మధ్యవర్తుల బృందాన్ని సుప్రీంకోర్టు అభినందించింది. అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపి పరిష్కారానికి దగ్గరగా వచ్చారంటూ వారిపై ప్రశంసలు కురిపించింది. అయోధ్య వివాదంపై రాజీ కోసం జస్టిస్ కలీఫుల్లా, శ్రీరాం పంచు, శ్రీశ్రీ రవిశంకర్‌లను సుప్రీంకోర్టు మధ్యవర్తులుగా నియమించిన సంగతి తెలిసిందే. ఈ బృందం కేసుకు సంబంధించి ఎంతోమంది తో చర్చలు జరిపింది. కానీ , సమస్యకు పరిష్కారం కనుగొలేకపోయింది. అయితే సమస్య పరిష్కారం కోసం వీరి చేసిన కృషిని సుప్రీంకోర్టు అభినందించింది.