Begin typing your search above and press return to search.

బ్యాంకుల‌కు.. మొబైల్ కంపెనీల‌కు సుప్రీం షాక్‌

By:  Tupaki Desk   |   3 Nov 2017 11:33 AM GMT
బ్యాంకుల‌కు.. మొబైల్ కంపెనీల‌కు సుప్రీం షాక్‌
X
మీ బ్యాంకు ఖాతాల్ని ఆధార‌త్ తో అనుసంధానం చేసుకున్నారా? మీ మొబైల్ ఫోన్ నెంబ‌రును ఆధార్ తో అప్డేట్ చేసుక‌న్నారా? అంటూ మేసేజ్ ల మీద మెసేజ్ లు రావ‌టం తెలిసిందే. ఇలా మెసేజ్ లు పంపుతూ.. వెంట‌నే కానీ అలా లింక్ చేసుకోక‌పోతే సేవ‌లు నిలిపివేస్తామంటూ బ్యాంకులు.. మొబైల్ కంపెనీలు చేస్తున్న బెదిరింపుల‌పై అత్యున్న‌త న్యాయ‌స్థానం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

ఎస్ ఎంఎస్‌ లు పంపుతూ ఒత్తిడి పెంచ‌టం స‌రికాదంటూ బ్యాంకులు.. మొబైల్ కంపెనీల‌కు సుప్రీం అక్షింత‌లు వేసింది. ఆధార్ విష‌యంలో ప్ర‌జ‌ల్ని బెంబేలెత్తించొద్దని కోరింది.

ఆధార్ చ‌ట్టం చెల్లుబాటు.. బ్యాంకు ఖాతాలు.. మొబైల్ నెంబ‌ర్ల‌తో ఆధార్‌ ను అనుసంధానం చేయాల‌న్న దానిపై సుప్రీంకోర్టులో కేసు న‌డుస్తోంది. ఈ పిల్‌పై విచారిస్తున్న సుప్రీం.. ఈ విష‌యంపై బ‌దులు ఇవ్వాల‌ని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

ఈ నెలాఖ‌రు నాటికి ఆధార్ పిటిష‌న్ల‌పై రాజ్యాంగ ధ‌ర్మాస‌నం ఎదుట తుది విచార‌ణ జ‌రుగుతుంద‌ని జ‌స్టిస్ ఏకే సిక్రీ.. అశోక్ భూష‌ణ్ ల‌తో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ తెలిసిందే. మొబైల్ కంపెనీలు.. బ్యాంకుల నుంచి వస్తున్న హెచ్చ‌రిక‌ల మెసేజ్ లు తాను కూడా అందుకున్న‌ట్లుగా జ‌స్టిస్ సిక్రీ పేర్కొన్నారు. ఆధార్ తో లింకేజ్ కోసం తుది గ‌డువుగా డిసెంబ‌రు 31.. ఫిబ్ర‌వ‌రి 6గా ఎస్ ఎంఎస్ ల‌లో ప్ర‌స్తావించాల‌ని పేర్కొంది.

ఇదిలా ఉండ‌గా బ్యాంకుల్లో కొత్త ఖాతా తెరిచేందుకు ఆధార్ త‌ప్ప‌నిస‌రిగా పొందుప‌ర‌చాలని కోర్టుకు కేంద్రం వెల్ల‌డించింది. లోక్ నీతి ఫౌండేష‌న్ కేసులో మొబైల్ ఆధార్ లింకేజ్ త‌ప్ప‌నిస‌రి అన్న నిబంధ‌న‌కు సుప్రీం స‌మ్మ‌తించింద‌న్న విష‌యాన్ని కోర్టుకు కేంద్రం వెల్ల‌డించింది. ఈ కేసు విచార‌ణ‌ను వాయిదా వేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.