Begin typing your search above and press return to search.
కోడల్ని తీసుకొస్తే ఆస్తులపై సీజ్ ఎత్తేస్తామన్న కోర్టు
By: Tupaki Desk | 13 March 2018 5:25 AM GMTకోడల్ని తీసుకొస్తే మీ ఆస్తుల మీద ఉన్న సీజ్ ఎత్తేస్తాం. ఈ మాట ఎవరన్నారో తెలుసా.. దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. విచారణలో ఉన్న ఒక కేసుకు సంబంధించి పారిపోయిన కోడల్ని పట్టుకు రావాలని..అప్పుడే.. ఆస్తులపై ఉన్న సీజ్ ఎత్తేస్తామని ఓ అత్తకు సుప్రీం స్పష్టం చేసింది.అంతేకాదు.. కోర్టుకు ఇచ్చిన మాట తప్పిందని వ్యాఖ్యానించింది. న్యాయవ్యవస్థపై లెక్కలేనితనం.. గౌరవం లేకున్నా.. వెనక్కి వస్తే కనీసం మంచి కోడలు అనిపించుకోవాలని పేర్కొంది. ఇంతకీ.. ఇలాంటి వ్యాఖ్యలు సుప్రీం ఎందుకు చేసింది? ఏ కేసుకు సంబంధించి ఇలా జరిగిందన్నది చూస్తే..
ఉత్తరప్రదేశ్ కు చెందిన రితికా అనే మహిళ బుష్ ఫుడ్స్ ఒవర్ సీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ప్రమోటర్ గా వ్యవహరించేవారు. ఈ కంపెనీ పేరుతో చాలామందికి టోకరా వేశారు. చీటింగ్.. ఫోర్జరీ తదితర నేరాలకు పాల్పడినట్లు ఆమెపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమె అరెస్ట్ అయ్యారు.
అరెస్ట్ సమయంలో తాను లండన్ వెళ్లి వస్తానని.. తనకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. అందుకు కోర్టు సమ్మతించింది. లండన్ కు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. సుప్రీంకోర్టు పలుమార్లు నోటీసులు పంపినా వెనక్కి తిరిగి రాలేదు. దీంతో కోర్టు ధిక్కార నేరం కింద ఆగ్రహం వ్యవక్తం చేసి.. ఆమె అత్తగారి ఆస్తుల్ని సీజ్ చేసింది. దీంతో ఆమె తరఫు లాయర్ సుప్రీంను ఆశ్రయించి..అత్త ఆస్తుల్ని సీజ్ నుంచి విడిపించాలని కోరారు.
దీనికి స్పందించిన కోర్టు.. మీరు మీ కోడల్ని వెనక్కి తీసుకురాకుంటే.. మేం సీజ్ చేసిన ఆస్తుల్ని విడుదల చేయలేమని తేల్చి చెప్పింది. కోడలు కానీ భారత్ కు వచ్చి కోర్టు ముందుకు వస్తే.. ఆస్తుల మీద సీజ్ కచ్ఛితంగా ఎత్తేస్తామని పేర్కొంది. తమ ఆదేశాల్లో మార్పు రావాలంటే ఆమె వెనక్కి రావాలని.. అప్పుడే తమ నిర్ణయంలో మార్పు ఉంటుందని సుప్రీం పేర్కొంది. మరి.. అత్త కోసం లండన్ వెళ్లిన కోడలు వెనక్కి వస్తుందా? అత్త ఆస్తుల్ని సీజ్ చేసిన నేపథ్యంలో సుప్రీం చెప్పినట్లు.. మంచి కోడలు అనిపించుకుంటుందా? అన్నది చూడాలి.