Begin typing your search above and press return to search.
చారిత్రక తీర్పు:కులం..మతంతో ఓట్లు అడగొద్దు
By: Tupaki Desk | 2 Jan 2017 7:50 AM GMTఅత్యున్నత న్యాయస్థానం చారిత్రక తీర్పును ఇచ్చింది. కులానికి కులం.. మతానికి మతం పేరు చెప్పుకొని ఓట్ల పంట పండించుకుంటున్న రాజకీయ నేతలకు షాకిచ్చేలా తాజాగా తీర్పును ఇచ్చింది. కుల మతాలతో ప్రజల్ని విభజిస్తూ రాజకీయం చేసే పార్టీలకు షాకిచ్చేలా తాజాగా చారిత్రక తీర్పును వెలువరించింది.
కుల మతాలతో రాజకీయాలు చేయొద్దని స్పష్టంగా చెప్పటమే కాదు.. ఆ పేరుతో ఓట్లు అడగటం తప్పని తేల్చి చెప్పింది. హిందుత్వ కేసులో దాఖలైన వివిధ పిటీషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. సంచలన తీర్పును వెలువరించింది. ఎన్నికలు అనేవి లౌకిక విధానంలో ఒక భాగంగా అభివర్ణించిన న్యాయస్థానం.. కులాలు.. మతాలు.. ప్రాంతాలకు అతీతంగా ఎన్నికల జరగాలన్న ఆకాంక్షను వ్యక్తం చేసింది.
భగవంతుడికి.. మనిషికి మధ్య సంబంధం వ్యక్తిగతమని.. ఇందులో ఎవరూ జోక్యం చేసుకోకూడదని తేల్చి చెప్పింది. రెండుదశాబ్దాల క్రితం ఇచ్చిన హిందుత్వ తీర్పును పున:సమీక్షించిన సుప్రీం ధర్మాసనం తాజాగా వివరంగా తీర్పును ఇచ్చింది.
ఎన్నికల్లో లబ్థి కోసం మతాన్ని దుర్వినియోగం చేయటం కూడా అవినీతి కిందకే వస్తుందని పేర్కొన్న అంశం.. ఎన్నికల చట్టంలో ఉందన్న సుప్రీం.. ఆ విషయాన్ని తాజాగా తాను వెలువరించిన తీర్పులో వెల్లడించింది. ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం ధర్మాసనం వెలువరించిన తాజా తీర్పును పలువురు చారిత్రకంగా అభివర్ణిస్తున్నారు. ఈ తీర్పు ప్రభావం రాజకీయాలపై తప్పనిసరిగా ఉంటుందన్న వాదనను పలువురు వినిపిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/