Begin typing your search above and press return to search.
సుజనాకు సుప్రీం షాక్!
By: Tupaki Desk | 4 March 2016 9:29 AM GMTకేంద్రమంత్రి సుజనా చౌదరికి షాక్ తగిలింది. మారిసస్ బ్యాంకు బకాయిలకు సంబంధించి నడుస్తున్న వివాదంలో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. కింది కోర్టుల్లో తగిలిన ఎదురుదెబ్బల్ని అధిగమించేందుకు సుప్రీంకోర్టుకు వెళ్లిన ఆయనకు.. అక్కడా దెబ్బ పడక తప్పలేదు.
మారిషస్ బ్యాంకు రుణ బకాయికి సంబంధించి రూ.100కోట్లు సుజనా చెల్లించాల్సి ఉంది. అయితే.. దీనికి సంబంధించి ఆయన ఇప్పటికే పలు కోర్లుల్ని ఆశ్రయించాడు.
ప్రతిచోట ఎదురైన అనుభవమే సుప్రీంలోనూ ఎదురైంది. ఆయన బకాయి ఉన్న రూ.100కోట్లను చెల్లించాల్సిందేనంటూ సుప్రీంకోర్టు తాజాగా స్పష్టం చేసింది. సుజనా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ దాఖలు చేసుకున్న పిటీషన్ ను కొట్టేసిన సుప్రీం.. మారిషస్ బ్యాంకుకు రూ.100కోట్లు చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది. ఇప్పటికైనా సుజనా తన న్యాయపోరాటాన్ని ఆపి.. బుద్ధిగా బకాయి చెల్లిస్తారా?