Begin typing your search above and press return to search.
ప్రధానినైనా.. బోనులో నిలబెట్టే మొగాడు కావాలి: సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 24 Nov 2022 3:41 AM GMTకేంద్ర ఎన్నికల సంఘానికి నేతృత్వం వహించే ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకంపై సుప్రీం కోర్టు గత రెండు రోజులుగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తోంది. టీఎన్. శేషన్ తర్వాత.. అలాంటి అధికారిని తాము చూడలేదని వ్యాఖ్యానించిన మరుసటి రోజే మరింత ఘాటుగా కామెంట్లు చేసింది. 'ప్రధానినైనా.. బోనులో నిలబెట్టే మొగాడు కావాలి' అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేంద్రంలో ఏ పార్టీ అదికారంలోకి ఉంటే.. ఆ పార్టీకి నచ్చిన వ్యక్తికి ఎన్నికల కమిషనర్ పదవిని కట్టబెడుతున్నారని అసహనం వ్యక్తం చేసింది.
ఇక, తాజా ఎన్నికల కమిషనర్‌గా అరుణ్ గోయల్ నియామకానికి సంబంధించిన ఫైల్‌ను తమ ముందు ఉంచాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎన్నికల అధికారిని రాజకీయ పార్టీల ప్రభావం నుంచి దూరంగా ఉంచాలని, అప్పుడే స్వతంత్రంగా వ్యవహరించగలరని వ్యాఖ్యానించింది. కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్రంగా పనిచేయాలంటే.. ప్రధాన ఎన్నికల అధికారి నియామకం కోసం ఏర్పాటు చేసే కమిటీలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా చేర్చాలని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
ఎన్నికల కమిషనర్ల నియామకంలో పాటిస్తున్న మార్గదర్శకాలు చెప్పాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. నవంబర్ 19న కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా అరుణ్ గోయల్ నియామకానికి సంబంధించిన ఫైల్‌ను కోర్టు ముందు ఉంచాలని జస్టిస్ కెఎం జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో ఎన్నికల కమిషనర్ల నియామకంపై విచారణ ప్రారంభమైన మూడు రోజుల్లోనే నియామకం జరిగిందన్న ధర్మాసనం అలా జరగకుండా ఉంటే మరింత సముచితంగా ఉండేదని వ్యాఖ్యానించింది.
భయం ఎందుకు?
ఈ కేసును విచారించడం మొదలు పెట్టిన తర్వాత నియామకం జరిగినందున ఆ ఫైళ్లను చూడలనుకుంటున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. నియామకం కోసం అనుసరించిన ప్రక్రియ ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నట్లు పేర్కొంది. ఈ నియామకం చట్టబద్ధమైనదైతే భయపడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. ఎన్నికల కమిషనర్ల నియామకంలో సీబీఐ డైెరెక్టర్ తరహాలో ప్రధాని, ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటి ద్వారా ఎంపిక జరపాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా కేంద్రాన్ని ఈ మేరకు సుప్రీంకోర్టు ఆదేశించింది.
ప్రస్తుత వ్యవస్థలో కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే.. తమకు అనుగుణంగా వ్యవహరించే వ్యక్తినే సీఈసీగా నియమిస్తోందని సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి.. 1991 చట్టం ప్రకారం జీతాలు, పదవీకాలాల విషయంలో ఎన్నికల కమిషన్ స్వతంత్రంగానే ఉందని తెలిపారు. సీఈసీ నియామక ప్రక్రియలో ప్రస్తుతం ఉన్న వ్యవస్థ సరిగ్గానే ఉందని, ఇందులో కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. సీనియర్ అధికారుల జాబితాను ఎంపిక చేసి.. దాన్ని న్యాయశాఖకు.. ఆ తర్వాత ప్రధానికి పంపుతామని తెలిపారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.