Begin typing your search above and press return to search.
సుప్రీం తేల్చేసింది.. శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష
By: Tupaki Desk | 14 Feb 2017 5:28 AM GMTతమిళనాడు ముఖ్యమంత్రి పీఠం కోసం అర్రులుచాస్తూ వారం రోజులుగా పట్టువీడకుండా ప్రయత్నాలు చేస్తున్న శశికళ సీఎం కలలకు బ్రేకులు పడ్డాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమెకు సుప్రీం కోర్టు నాలుగేళ్ల శిక్ష విధించింది. దీంతో ప్రస్తుతం శశికళ ముఖ్యమంత్రి పీఠానికి అనర్హురాలిగా మారింది. ఇప్పుడు తమిళ రాజకీయం ఎలా మారుతుందో.. పన్నీర్ కు రూటు క్లియర్ అవుతుందో.. లేదంటే శశికళ శిబిరం నుంచి రెండో క్రుష్ణుడెవరైనా వస్తారో చూడాలి.
ఆదాయాన్ని మించిన ఆస్తుల కేసులో శశికళను దోషిగా నిర్ణయిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. శశికళకు 4 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ - జస్టిస్ అమిత వరాయ్ లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శశికళను దోషిగా నిర్ణయించడంతో అనుకున్నంతా అయింది. ఈ కేసులో ఏ-2 ముద్దాయిగా ఉన్న శశికళకు శిక్ష విధించాల్సిందేనని ధర్మాసనం అభిప్రాయపడింది.
జస్టిస్ పినాకి చంద్రఘోష్ తీర్పును చదువుతూ, ఈ కేసు తీవ్రమైనదని వ్యాఖ్యానించారు. చట్టాన్ని మీరి ప్రవర్తించినట్టు స్పష్టమవుతోందని అన్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులంతా దోషులేనని ఆయన తన తీర్పులో పేర్కొన్నారు.
కాగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 15వేల మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. రాజ్ భవన్ - పోయెస్ గార్డెన్ - పన్నీర్ సెల్వం నివాసం - పార్టీ కార్యాలయాలు - గోల్డెన్ బే రిసార్ట్స్ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఈ కేసులో సహ నిందితులుగా శశికళ - ఇళవరసి - సుధాకరన్ ఉన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/