Begin typing your search above and press return to search.

వేటు మీద సుప్రీం కెళితే..స్పీక‌ర్ ను అడ‌గాల‌న్న కోర్టు!

By:  Tupaki Desk   |   29 Jun 2019 4:44 AM GMT
వేటు మీద సుప్రీం కెళితే..స్పీక‌ర్ ను అడ‌గాల‌న్న కోర్టు!
X
కార‌ణం ఏమైనా కావొచ్చు పార్టీల నుంచి జంపింగ్ లు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. ఒక్కటంటే ఒక్క ఎంపీ మ‌ద్ద‌తు నిలిస్తే చాలు.. ప్ర‌భుత్వాన్ని నిలుపుకునే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ.. న‌మ్మిన సిద్ధాంతం కోసం ప్ర‌భుత్వాన్ని ప‌ణంగా పెట్టిన ఘ‌న చ‌రిత్ర బీజేపీ పార్టీ ది అలాంటి పార్టీ ఇప్పుడు పార్టీ విలీనం పేరుతోనో.. మ‌రో కార‌ణం చేత‌నో వివిధ పార్టీల‌కు చెందిన నేత‌ల్ని త‌న‌లో క‌లిపేసుకుంటున్న ప‌రిణామ‌క్ర‌మంలో భాగంగా తాజాగా ఢిల్లీకి చెందిన అధికార‌ప‌క్ష నేత‌లు క‌మ‌ల‌నాథులుగా మారిపోతున్నారు.

తాజాగా ఆమ్ ఆద్మీకి చెందిన ఎమ్మెల్యే దేవేంద‌ర్ సెహ్రావ‌త్ ఇదే రీతిలో జంప్ అయి క‌మ‌లం గూటికి చేరిపోయారు. ఆయ‌న అలా జంప్ అయ్యారో లేదో.. ఆయ‌న ఎమ్మెల్యే ప‌ద‌విపై అన‌ర్హ‌త వేటు వేశారు. దీంతో అత‌లాకుత‌ల‌మైన అయ్య‌గారు ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. ఢిల్లీ అసెంబ్లీ స్పీక‌ర్ కార్యాల‌యం త‌న‌కు పార్టీ ఫిరాయింపుల నిరోధ‌క చ‌ట్టం కింద నోటీసులు ఎలా ఇస్తారంటూ ప్ర‌శ్నిస్తున్నారు.

బీజేపీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వం కూడా తాను తీసుకోలేద‌ని.. అలాంట‌ప్పుడు త‌న‌ను అన‌ర్హుణ్ని చేయ‌టం స‌రికాదంటూ కోర్టును కోరుకున్నారు. ఎమ్మెల్యే వారి వాద‌న‌ను విన్న సుప్రీంకోర్టు ఆస‌క్తిక‌ర నిర్ణ‌యాన్ని వెల్ల‌డించింది. ఎమ్మెల్యేకున్న అభ్యంత‌రాల్ని తొలుత అసెంబ్లీ స్పీక‌ర్ ఎదుట జ‌రిగే చ‌ర్చ‌లో వెల్ల‌డించాలంటూ జ‌స్టిస్ సంజీవ్ ఖ‌న్నా.. జ‌స్టిస్ బీఆర్ అగ‌ర్వాల్ తో కూడిన ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది. ఊహించ‌ని రిజ‌ల్ట్ తో స‌ద‌రు ఎమ్మెల్యే వారు త‌న పిటిష‌న్ ను వెన‌క్కి తీసుకోవాల్సి వ‌చ్చింది. అత్యుత్త‌మ న్యాయ‌స్థానం నిర్ణ‌యం స‌ద‌రు జంపింగ్ ఎమ్మెల్యే గొంతుకు అడ్డం ప‌డి.. ఊపిరి ఆడ‌న‌ట్లుగా మారిన‌ట్లు చెబుతున్నారు. చేసుకున్నోడికి చేసుకున్నంత అని ఊరికే అన‌లేదు మ‌రి!