Begin typing your search above and press return to search.
కోహినూర్ మీద ఆశలు వదిలేసుకోవటమే!
By: Tupaki Desk | 30 April 2019 6:29 AM GMTప్రపంచంలో ఎన్ని వజ్రాలు ఉన్నా.. అవేమీ కోహినూర్ వజ్రం సాటికి రావన్న సంగతి తెలిసిందే. వందల ఏళ్లుగా వార్తల్లో నానుతూ.. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ప్రతి భారతీయుడి మదిలో దాగిన కోహినూర్ వజ్రం మీద కోట్లాది మందిపెట్టుకున్న ఆశలకు నూకలు చెల్లినట్లే. అత్యంత విలువైన వజ్రంగా చెప్పే కోహినూర్ ను భారత్ కు తీసుకొచ్చే అంశం మీద చాలానే ఆశలు పెట్టుకున్నోళ్లు ఉన్నాయి.
ప్రస్తుతం బ్రిటన్ వద్ద ఉన్న కోహినూర్ వజ్రాల్ని భారత్ కు తిరిగి తీసుకొచ్చే విషయంపై సుప్రీంలో దాఖలైన పిటిషన్ పై తాజాగా తీర్పు వచ్చేసింది. వాస్తవానికి ఇదే అంశం మీద దాఖలైన పిటిషన్ ను విచారించిన సుప్రీం 2017 నవంబరులో పిటిషన్ ను కొట్టేసింది. వేరే దేశం ఆధీనంలో ఉన్న వజ్రాన్ని తిరిగి దేశానికి తిరిగి వచ్చేలా ఆదేశాల్ని జారీ చేయలేమని సుప్రీం తెల్చింది.
ఇదిలా ఉంటే.. సదరు తీర్పును మరోసారి రివ్యూ చేయాలన్న నేపథ్యంలో తాజాగా ఆ అంశంపై సుప్రీంలో విచారణ జరిగింది. 108 కారెట్ల కోహినూర్ వజ్రం దక్షిణ భారత్ లో లభించినట్లు చెబుతారు. గుంటూరు జిల్లాలో దొరికినట్లుగా చెప్పే ఈ వజ్రం.. బ్రిటిష్ వారు దొంగలించలేదు. అదే సమయంలో బలవంతంగా లాక్కున్నది లేదు. పంజాబ్ ను పాటించిన నాటి పాలకుల్లో ఒకరు ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చారు. వారు బ్రిటన్ మహారాణికి ఇచ్చారు. ప్రస్తుతం ఆమె వద్దే ఈ అపురూప వజ్రం ఉంది. ఇదే విషయం సుప్రీంకు కేంద్రం చెప్పింది.
తాజాగా ఈ అంశాన్ని విచారించిన కోర్టు.. భారత్ కు తిరిగి తెచ్చే అంశం సాధ్యం కాదని తేల్చేయటమే కాదు.. సుప్రీంలో దాఖలైన పిటిషన్ ను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో.. ఇంతకాలం మిణుకు మిణుకు మంటున్న ఆశలకు పుల్ స్టాప్ పడినట్లే.