Begin typing your search above and press return to search.

లఖింపూర్ ఖేరి :యూపీ ప్రభుత్వం చర్యలపై సుప్రీం అసంతృప్తి !

By:  Tupaki Desk   |   8 Oct 2021 10:37 AM GMT
లఖింపూర్ ఖేరి :యూపీ ప్రభుత్వం చర్యలపై సుప్రీం అసంతృప్తి !
X
లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనకు సంబంధించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. హత్యారోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రాను ఎందుకు అరెస్టు చేయలేదని సీజేఐ ఎస్వీ రమణ సారథ్యంలోని ధర్మాసనం ప్రశ్నించింది. లఖింపూర్ హింసాత్మక ఘటనపై వేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది.

అయితే, పోస్టుమార్టం రిపోర్టులో మృతుల శరీర భాగాల్లో బుల్లెట్‌ గాయాలు లేవని తేలిందని యూపీ సర్కార్‌ తరపు న్యాయవాది హరీష్‌ సాల్వే కోర్టుకు తెలిపారు. అందుకనే ఆశిష్‌ను అరెస్టు చేయలేదని, విచారణకు హాజరు కావాలని నోటీసులు మాత్రమే ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు. సాల్వే వ్యాఖ్యలపై స్పందించిన సీజేఐ ఎన్‌వీ రమణ నిందితులందరికీ చట్టం ఒకేలా వర్తిస్తుందని అన్నారు. నోటీసులు ఇచ్చి ఊరుకుంటారా, అని ప్రశ్నించారు.

ఈక్రమంలో 8 మంది మృతికి కారణమైన లఖింపూర్‌ కేసును కావాలంటే సీబీఐకి బదిలీ చేయొచ్చని సాల్వే సుప్రీం కోర్టుకు సమాధానం ఇచ్చారు. అవసరమైన చర్యలు చేపడతామని అన్నారు. అయితే, సీబీఐ విచారణ సమస్యకు పరిష్కారం కాదన్నారు సీజేఐ ఎన్‌వీ రమణ. తదుపరి విచారణను అక్టోబర్‌ 20కి వాయిదా వేశారు.హరీష్ సాల్వే హామీలపై ధర్మాసనం సంతృప్తి వ్యక్తం చేస్తూ, స్థాయీ నివేదక సమర్పించాలని ఆదేశించింది. సాక్ష్యాలు తారుమారు కాకుండా పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలని యూపీ పోలీస్ ఉన్నతాధికారులను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను 20వ తేదీకి వాయిదా వేసింది.