Begin typing your search above and press return to search.

స‌హ‌జీవ‌నంలో రిలేష‌న్ రేప్ కానే కాదు!

By:  Tupaki Desk   |   3 Jan 2019 7:18 AM GMT
స‌హ‌జీవ‌నంలో రిలేష‌న్ రేప్ కానే కాదు!
X
సుప్రీంకోర్టు ఆస‌క్తిక‌ర తీర్పును వెల్ల‌డించింది. ఇటీవ‌ల కాలంలో స‌మాజంలో అంత‌కంత‌కూ పెరిగిపోతున్న లివింగ్ రిలేష‌న్ల‌పైనా.. ఆ రిలేష‌న్ల లెక్క‌లో తేడా వ‌చ్చిన ప‌క్షంలో న‌మోద‌య్యే కేసులపై కాస్తంత క్లారిటీ ఇచ్చేలా ఒక తీర్పును ఇచ్చింది. త‌మ ముందుకు వ‌చ్చిన ఒక కేసును కొట్టివేసే క్ర‌మంలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.

స‌హ‌జీవ‌నం చేసే ఇద్ద‌రు వ్య‌క్తులు ప‌ర‌స్ప‌ర అంగీకారంతో కలిసి శృంగారం చేసిన‌ప్పుడు అది రేప్ ఎంత‌మాత్రం కాద‌ని స్పష్టం చేసింది. కొన్ని ప్ర‌త్యేక ప‌రిస్థితులు ఉన్న‌ప్పుడు స‌హ‌జీవ‌నంలో ఉన్న పురుషుడు త‌న భాగ‌స్వామిని వివాహం చేసుకోని ప‌క్షంలో.. వారి మ‌ధ్య‌నున్న భౌతిక సంబంధం రేప్ ఎంత‌మాత్రం కాద‌ని చెప్పింది. మ‌హారాష్ట్రకు చెందిన ఇద్ద‌రి వ్య‌క్తుల మ‌ధ్య‌నున్న స‌హ‌జీవ‌నానికి సంబంధించిన కేసును కొట్టివేసింది.

మ‌హారాష్ట్రకు చెందిన న‌ర్సు ఒక డాక్ట‌ర్ పై కేసు పెట్టింది. భ‌ర్త చ‌నిపోయిన త‌ర్వాత ఆ న‌ర్సు.. డాక్ట‌ర్ తో ప్రేమ‌లో ప‌డింద‌ని వారిద్ద‌రూ కొన్నాళ్లుగా స‌హ‌జీవ‌నం చేస్తున్నట్లు పేర్కొంది. త‌న‌ను మోసం చేసి రేప్ చేసిన‌ట్లుగా ఆమె పేర్కొన్నారు. సాక్ష్యాలు.. ఆధారాలు ప‌రిశీలించిన కోర్టు స్పందిస్తూ.. రేప్ కు.. ప‌ర‌స్ప‌ర అంగీకారంతో చేసే శృంగారినిక చాలా తేడా ఉన్న‌ట్లు స్ప‌ష్టం చేసింది.

ఇలాంటి సంద‌ర్భాల్లో కోర్టులు జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించింది. ఫిర్యాదు వ‌చ్చిన వ్య‌క్తి నిజంగానే బాధితురాల్ని వివాహం చేసుకోవాల‌నుకున్నాడా? లేదంటే అత‌ను దురుద్దేశంతో ఉన్నాడా? త‌న కోరిక‌ను తీర్చుకోవ‌టానికి త‌ప్పుడు ప్ర‌మాణం చేశాడా? లాంటి సున్నిత అంశాల్ని ప‌రిశీలించాల‌ని పేర్కొంది.

నిందితుడి మోసం కార‌ణంగా శృంగారంలో పాల్గొన్నారా? లేదంటే అతడంటే ప్రేమ కార‌ణంగా శృంగారానికి ఓకే చెప్పారా? లాంటి అంశాల్ని ప‌రిశీలించి నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంద‌న్నారు. తాజా కేసులో మాత్రం న‌ర్సు చేసిన రేప్ ఫిర్యాదును కోర్టు కొట్టివేసింది. ఇష్టంగా ఇరువురి మ‌ధ్య జ‌రిగిన శృంగారాన్ని రేప్ గా ప‌రిగ‌ణించ‌లేమ‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది.