Begin typing your search above and press return to search.
బీజేపీ.. కాంగ్రెస్ తో సహా తొమ్మిది పార్టీలకు ఫైన్ వేసిన సుప్రీం ధర్మాసనం
By: Tupaki Desk | 11 Aug 2021 5:30 AM GMTమీ కంపెనీలో రెండు హత్యలు.. నాలుగు రేప్ లు చేసిన వ్యక్తికి కీలక పదవిని ఇస్తారా? మీ వ్యాపార భాగ్వస్వామిగా దొమ్మిలకు.. ఆస్తుల్ని ధ్వంసం చేసిన చరిత్ర ఉన్న వ్యక్తిని చేర్చుకుంటారా? అంతదాకా ఎందుకు? అద్దెకు ఇచ్చేందుకు మీకో ఇల్లు ఉందని అనుకుందాం. దాన్ని హత్యారోపణలు ఉన్న వ్యక్తికి అద్దెకు ఇస్తారా? అంటే లేదంటే లేదంటారు. మరి.. ఇలాంటి వేటికి పనికి రాని వ్యక్తులు.. మన పాలకులుగా ఎందుకు పనికి వస్తారు? చట్టాలు చేసి.. ప్రజల నెత్తిన కూర్చోవటానికి వారి చేతికి అధికారాన్నిఎందుకు ఇస్తున్నట్లు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే.. ఎంతకూ దొరకవు.
నిత్యం నీతులు వల్లించే రాజకీయ నాయకుడు.. తమ పార్టీ ఎన్నికల్లో గెలవాలంటే అభ్యర్థి నేర చరిత్ర ఉండే గట్టి క్యాండిడేట్ ను సెలెక్టు చేయటం ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. ఇలాంటి వారిని తిప్పి కొట్టాల్సిన ప్రజలు.. ఏదో ఒక భావోద్వేగానికి గురై రాజీ పడుతూ ఓట్లు వేసేయటం.. తర్వాత కష్టం వచ్చినప్పుడు మాత్రం.. వ్యవస్థ తీరును తిట్టిపోయటం తరచూ కనిపించేదే. ఇలాంటి తీరుకు చెక్ పెట్టేందుకు వీలుగా సుప్రీం కోర్టు నడుం బిగించింది. నేర రహిత రాజకీయాలకు పెద్ద పీట వేసేందుకు వీలుగా.. తమకున్న పరిమితమైన పరిధిలో తాము చేయాల్సిన దాని కంటే ఎక్కువే చేస్తోంది.
తాజాగా వెలువడిన ఆదేశాలు ఇందుకు నిదర్శనంగా చెప్పాలి. నేర చరిత్ర ఉన్న అభ్యర్థుల్ని పార్టీ అభ్యర్థులగా ప్రకటించిన ఉంటే.. వారి నేరమయ జీవితాల్ని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కానీ.. అలా చేయకుండా ఉంటున్న రాజకీయ పార్టీలకు షాకిచ్చింది సుప్రీంకోర్టు. గతంలో తాము ఇచ్చిన ఆదేశాల్ని సరిగా అమలు చేయని రాజకీయ పార్టీలకు తాజాగా సుప్రీంకోర్టు జరిమానా విధించింది. ఆ పార్టీలు కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లుగా నిర్దారించింది. బిహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో తమ అభ్యర్థుల నేర చరిత్రను బయటపెట్టని పార్టీలకు జరిమానాల్ని విధించింది.
సీపీఎం.. ఎన్ సీపీలకు రూ.5లక్షల చొప్పున ఫైన్ వేసిన సుప్రీంకోర్టు.. బీజేపీ.. కాంగ్రెస్ తో సహా మరో ఐదు పార్టీలు తలో లక్ష రూపాయిల్ని జరిమానాను చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఫ్యూచర్ లోఈ రాజకీయ పార్టీలు జాగ్రత్తగా ఉండాలని.. అభ్యర్థుల నేరచరిత్రను తాజా ఆదేశాలకు అనుగుణంగా.. 48 గంటల్లో ప్రకటించాలని పేర్కొంది. అంతేకాదు.. సదరు అభ్యర్థులను ఎందుకుఎంపిక చేశారో కూడా వివరిస్తూ కారణాల్ని కూడా తమ పార్టీ వెబ్ సైట్లలో వివరాల్ని పొందుపర్చాలని పేర్కొంది. రాజకీయ పార్టీల మైండ్ సెట్ మార్చేందుకు వీలుగా సుప్రీం తాజా ఆదేశాలు ఉన్నాయని చెప్పక తప్పదు.