Begin typing your search above and press return to search.
గుజరాత్ అల్లర్ల కేసు: మోడీ ప్రమేయంపై సుప్రీంకోర్టు తీర్పు
By: Tupaki Desk | 24 Jun 2022 7:02 AM GMTప్రధాని నరేంద్రమోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో చోటుచేసుకున్న 'గోద్రా అల్లర్లు' దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపాయి. రెండు వర్గాల మధ్య జరిగిన ఈ ఘర్షణలో ఎంతో మంది చనిపోయారు. ఈ అల్లర్లకు నాటి సీఎం మోడీ కారణమని చాలా మంది కోర్టులకు ఎక్కారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేసులు పెట్టి విచారణ జరిపింది. సుప్రీంకోర్టులో పలు పిటీషన్లు దాఖలయ్యాయి.
తాజాగా గుజరాత్ అల్లర్ల కేసులో మోడీకి వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2002 గుజరాత్ అల్లర్లలో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్రమోడీతోపాటు మరికొందరికీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ క్లీన్ చిట్ ను సవాల్ చేస్తూ కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎహ్సాన్ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన న్యాయమూర్తులు ఏఎం ఖాన్విల్కర్, దినేష్ మహేశ్వరి, సీటీ రవికుమార్ లతో కూడిన ధర్మాసనం పిటీషన్ ను కొట్టివేసింది.
గుజరాత్ అల్లర్ల సమయంలో అహ్మదాబాద్ లోని గుల్బర్గా సొసైటీలో హత్యకు గురైన 69మందిలో పిటీషనర్ జాకియా జాఫ్రీ భర్త, కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎహ్సాన్ జాఫ్రీ కూడా ఉన్నారు. అయితే దీనివెనుక భారీ కుట్ర ఉందని ఆరోపిస్తూ జాకియా, ప్రముఖ సోషల్ మీడియా యాక్టివిస్ట్ తీస్తా సేతల్వాద్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
2012లో సిట్ దాఖలు చేసిన నివేదికకు వ్యతిరేకంగా జాఫ్రీ దాఖలు చేసిన పిటీషన్ ను గుజరాత్ స్పెషల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ తిరస్కరించారు. అయితే ఆ ఉత్తర్వును సుప్రీంకోర్టు బెంచ్ శుక్రవారం సమర్థించింది. జాఫ్రీ అభ్యర్థనకు ఎటువంటి అర్హత లేదని పేర్కొంది.
జాఫ్రీ తరుఫున కపిల్ సిబల్ వాదించారు. మాజీ పోలీస్ అదికారి సంజీవ్ భట్ స్టేట్ మెంట్ ఆధారంగా నరేంద్రమోడీపై ఆరోపణలు వచ్చాయని పేర్కొన్నారు. భట్ ఆ సమావేశంలో లేరని.. అందువల్ల ఆరోపణలను ధృవీకరించడానికి వేరే మార్గం లేదని సిట్ తేల్చింది. ఇక సొలిసిటర్ జనరల్ మాత్రం మోడీ ఆరోపణ న్యాయాన్ని అపహాస్యం చేయడమేనని అన్నారు.
అల్లర్ల కేసుల దర్యాప్తును పర్యవేక్షించిన సుప్రీంకోర్టు ఆరోపణలను పరిశీలించాల్సిందిగా 20211లో సిట్ ను ఆదేశించింది. ఫిబ్రవరి 2012లో సిట్ నివేదిక దాఖలు చేసింది. ఈ నివేదికపై ట్రయల్ కోర్టు, గుజరాత్ హైకోర్టులో సవాల్ చేయడంలో పిటీషనర్లు విఫలమయ్యారు. తిరిగి 2018లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు కిందటి ఏడాది డిసెంబర్ లోనే తీర్పును రిజర్వ్ చేసింది.
2002 ఫిబ్రవరి 28న అహ్మదాబాద్ లోని గుల్బార్గా సొసైటీలో జరిగిన హింసాకాండలో 69మంది మరణించారు. చనిపోయిన వారిలో ఎహ్సాన్ జాఫ్రీ కూడా ఉన్నారు. ఈ అల్లర్ల సమయంలో గుజరాత్ సీఎంగా నరేంద్రమోడీ ఉన్నారు. ఈ కేసులో అప్పటి సీఎం నరేంద్రమోడీతో సహా 64మందికి సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ ఎహ్సాన్ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ గుజరాత్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. సిట్ చర్యను హైకోర్టు సమర్థించగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు డిసెంబర్ 9న 2021న తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది.