Begin typing your search above and press return to search.
రుషికొండలో నిర్మాణాలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్.. ప్రభుత్వానికి చిక్కులే!
By: Tupaki Desk | 1 Jun 2022 10:30 AM GMTవిశాఖపట్నంలోని రిషికొండలో టూరిజం భవనాల నిర్మాణాలపై ఎన్టీటీ విధించిన స్టే ఎత్తివేయాలని.. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రిషికొండ నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్కడ చదును చేసే ప్రాంతంలో నిర్మాణాలు చేసుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతి మంజూరు చేసింది. ఇప్పటికే నిర్మాణాలున్న ప్రాంతంలో యథావిధిగా నిర్మాణాలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది.
రుషికొండ ప్రాజెక్ట్ కేసు విచారణ హైకోర్టుకు బదిలీ చేసింది. ట్రిబ్యూనల్ పరిధి కంటే హైకోర్టు పరిధి ఎక్కువని తేల్చింది సుప్రీంకోర్టు. హైకోర్టు ఆదేశించినప్పటికీ ఎన్జీటీ బేఖాతరు చేయడం తగదని హితవు పలికింది.
ఏపీ ప్రభుత్వ తరుఫున లాయర్ ఇప్పటికే సగం నిర్మాణాలు పూర్తయ్యాయని వాదించారు. హైకోర్టులో పిటీషన్లు పెండింగ్ లో ఉన్నందున అక్కడే పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. పాత రిసార్ట్ ఉన్న ప్రాంతంలో మాత్రమే నిర్మాణాలు చేపట్టాలని.. కొత్తగా ఎలాంటి తవ్వకాలు వద్దని చెప్పడంతో ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి ఎదురైనట్లేనని భావిస్తున్నారు. ట్రిబ్యునల్ పరిధి కంటే హైకోర్టు పరిధి ఎక్కువని సుప్రీంకోర్టు తేల్చింది. హైకోర్టు రాజ్యాంగబద్ద సంస్థ కాబట్టి హైకోర్టు ఉత్తర్వులే అమలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. హైకోర్టులో తేలేవరకూ ఎన్జీటీలో విచారణ జరపరాదని ఆదేశించింది. ఎన్జీటీలో జరిగే విచారణను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ ఆధారంగా ప్రాజెక్టు పనులను నిలిపివేస్తూ ఎన్జీటీ స్టే ఇవ్వడాన్ని తప్పుపడుతూ ఏపీ ప్రభుత్వం పిల్ వేసింది. ఈ పిటీషన్ పై మంగళవారం వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టులను చేరుకోలేని వారు రాసే లేఖలను మాత్రమే పిటీషన్లుగా పరిగణించాలంటూ హితవు పలికింది. ఏపీ ప్రభుత్వం తరుఫున సీనియర్ అడ్వకేట్ సింఘ్వీ వాదనలు వినిపించారు.
ఈ ప్రాజెక్టుతో 300 మందికి ఉపాధి దొరుకుతుందని.. రూ.180 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రభుత్వం కోర్టుకు వివరించింది. ఓ ఎంపీ రాసిన లేఖ ఆధారంగా ఎన్టీజీ స్టే ఉత్తర్వులు జారీ చేసిందని తెలుపగా.. సుప్రీంకోర్టు ఎన్టీటీ తీరు సరికాదని హితవు పలికింది. ఈ కేసులో తదుపరి విచారణను సుప్రీంకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు రిషికొండ నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ మంజూరు చేసింది.
రిషికొండ సమీపంలో ప్రభుత్వానికి చెందిన మరితా రిసార్ట్స్ ఉండేవి. ఇక్కడి అందాలను చూడడానికి వచ్చే పర్యాటకులకు ఈ రిసార్ట్ వసతి సౌకర్యం కల్పించేవి. అయితే అకస్మాత్తుగా కూల్చేసిన ప్రభుత్వం ఇప్పుడు పెద్దస్థాయి టూరిజం హోటల్ కడుతామని రిషికొండను తవ్వేస్తున్నారు. అయితే ఆ మాట అధికారికంగా చెప్పడం లేదు. సీఎం క్యాంప్ ఆఫీస్ కోసం అని అంటున్నారు. దీంతో కోర్టుల్లో పిటీషన్లు దాఖలయ్యాయి.