Begin typing your search above and press return to search.
పెళ్లికాని జంట హోటల్ రూమ్ బుక్ చేసుకుంటే తప్పా?
By: Tupaki Desk | 31 Aug 2019 5:47 AM GMTసమాజం మారింది. ఆధునిక పోకడలు పెరిగిపోయాయి. డేటింగ్ ల వరకూ విస్తరించింది. ఇప్పుడు ప్రేమ పెళ్లిళ్లు చాలా కామన్. అయితే పెళ్లికాకుండానే విరహించే జంటలు ఎన్నో ఉన్నాయి. మలేషియా - థ్యాయ్ లాండ్ లో వ్యభిచారం అదో వృత్తిగానే చూస్తారు. అక్కడ కేసులుండవు. ప్రాసిక్యూషన్ ఉండదు. ఇక జంటలు పెళ్లితో సంబంధం లేకుండానే హోటల్స్ లో ఉండొచ్చు.. తిరగొచ్చు.
కానీ ఇండియాలో మాత్రం ఆంక్షలున్నాయి. పెళ్లికాని జంట పార్క్ లో కనిపిస్తే అనుమానంగా చూస్తారు.. ఫిబ్రవరి 14న పెళ్లిళ్లు చేస్తారు. ఏదైనా హోటల్ కు వెళితే హోటల్ వాళ్లు నేరం అయినట్టు రూమ్ ఇవ్వరు.. పైగా రూమ్ తీసుకున్నా పోలీసులతో తంటా.. ఎప్పుడు వ్యభిచారం అంటూ రైడ్ కు వస్తారో తెలియదు.. దొరికితే లోపలేస్తారు.. చివరకు పెళ్లి కాకుండా ఏదైనా ఇళ్లు అద్దెకు తీసుకున్నా దేశంలో ఇవ్వరు.
అయితే ఇదే ఇబ్బంది తాజాగా దేశంలోని ఓ జంటకు వచ్చింది. ముంబైకి చెందిన ఓ పురుష పుంగవుడు తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. పెళ్లికాని జంటకు హోటల్ లో రూమ్ ఇవ్వడం లేదని పిటీషన్ లో పేర్కొన్నారు. అయితే దీనిపై సుప్రీం తాజాగా తీర్పునిచ్చింది. పెళ్లి కాని జంటకు హోటల్ రూమ్ ఇవ్వకూడదని ఏ చట్టంలో లేదని స్పష్టం చేసింది. భారత రాజ్యాంగంలో కనీసం ఒక్క పేరాలో కూడా దీనిమీద అభ్యంతరం లేదని వివరణ ఇచ్చింది. పెళ్లికాని జంటకు హోటల్ రూమ్ ఇవ్వకపోవడం అన్నది వారి ప్రాథమిక హక్కులను హరించడం అని సుప్రీం కామెంట్ చేసింది.
ఈ తీర్పతో ఇప్పుడు పెళ్లికాని జంటలు హోటల్స్ లో రూమ్ బుక్ చేసుకోవచ్చు. సరదాగా ఎంజాయ్ చేయవచ్చని రుఢీ అయ్యింది. మరీ హోటల్స్ యజమానులు - పోలీసులు ఈ విషయంలో సుప్రీం ఆదేశాలను ఎంతవరకు పాటిస్తారన్నది వేచిచూడాలి.