Begin typing your search above and press return to search.

రవిప్రకాష్ కు షాకిచ్చిన సుప్రీం కోర్టు

By:  Tupaki Desk   |   3 Jun 2019 11:21 AM GMT
రవిప్రకాష్ కు షాకిచ్చిన సుప్రీం కోర్టు
X
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. టీవీ9 చేతుల్లో ఉండగా.. ఆయనో కింగ్ మేకర్.. ప్రభుత్వాలను కూడా దడదడలాడించిన శక్తిసామార్థ్యాలు కలిగి ఉన్న వ్యక్తి ఇప్పుడు అజ్ఞాతంలో గడపాల్సిన పరిస్థితి దాపురించింది. ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వాన్ని కెలికాడో అప్పుడే రవిప్రకాష్ ఖేల్ ఖతమైందన్న చర్చ మీడియా వర్గాల్లో సాగుతోంది. ఇప్పుడు డేటా చోరీ, మోసం కేసుల్లో ఇరుక్కొని రవిప్రకాష్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయాడు.

కాగా ఇప్పటికే డేటాచోరీ - ఫోర్జరీ కేసుల్లో ముందస్తు బెయిల్ కావాలని రవిప్రకాష్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా చుక్కెదురైంది. లొంగిపోయి విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. దీంతో రవిప్రకాష్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఆ కేసులో సోమవారం సుప్రీం కీలక తీర్పునిచ్చింది.

ముందస్తు బెయిల్ పిటీషన్ పై హైకోర్టును ఆశ్రయించాలని.. పోలీసుల విచారణకు హాజరు కావాల్సిందేనని రవిప్రకాష్ కు సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. రవిప్రకాష్ తరుఫున వాదించిన అభిషేక్ మను సింఘ్వీ వాదించారు. ముందస్తు బెయిల్ పై విచారణ జరిపించేలా హైకోర్టు ఆదేశించాలని సుప్రీం ను అభ్యర్థించారు. దీంతో సుప్రీం సమ్మతించి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయాలని కోరింది. జూన్ 10లోపు ముందస్తు బెయిల్ పై విచారణ జరిపి ఆదేశాలివ్వాలని హైకోర్టును సూచించింది. అయితే ముందు పోలీసులకు లొంగిపోయి విచారణకు సహకరించాలని కోరింది. 41ఏ నోటీస్ కింద విచారణకు రవిప్రకాష్ హాజరుకావాల్సిందేనని సుప్రీం సూచించింది. అయితే పోలీసులు రవిప్రకాష్ ను అరెస్ట్ చేయాలంటే 48 గంటల ముందు నోటీసులు ఇచ్చాకే ముందుకెళ్లాలని స్పష్టం చేసింది.

ఇలా సుప్రీంకోర్టు కూడా రవిప్రకాష్ ముందస్తు బెయిల్ పై ఊరటనిస్తూనే ముందు లొంగిపోయి విచారణకు సహకరించాలని సూచించడంతో రవిప్రకాష్ పోలీసుల ఎదుట విచారణకు రావడం తప్పనిసరిగా మారింది.