Begin typing your search above and press return to search.
క్రీ.పూ.లోనే మన దగ్గర స్వలింగ సంపర్కం
By: Tupaki Desk | 12 July 2018 3:35 AM GMTప్రపంచం దేని గురించైనా ఆలోచించటానికి వందల ఏళ్ల ముందే.. మనం ఆలోచించామన్న ఆనవాళ్లు చాలా విషయాల్లో కనిపిస్తుంటాయి. స్వలింగ సంపర్కం నేరమన్న విషయంపై ఇప్పుడు మళ్లీ చర్చ మొదలైంది. హోమో సెక్స్ అంశంపై అమల్లో ఉన్న చట్టాల్ని మార్చాలంటూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ షురూ చేసిన నేపథ్యంలో ఈ వ్యవహారం లోతుల్ని ఒక్కసారి పరిశీలిస్తే.. ఆసక్తికర అంశాలెన్నో కనిపిస్తాయి.
భారతదేశంలో స్వలింగ సంపర్కం గతంలో లేదా? అన్నది చూస్తే.. ఖజురహో శిల్పాల్లో స్వలింగ సంపర్కానికి సంబంధించిన ఆనవాల్లుకనిపిస్తాయి. అంతదాకా ఎందుకు..స్వలింగ సంపర్కానికి పాల్పడే బాలికలకు 200 నాణేల ఫైన్.. 10 కొరడా దెబ్బల శిక్ష విధించాలంటూ మనుస్మృతి చెబుతోంది. అదే ఒక మహిళ.. బాలికతో స్వలింగ సంపర్కానికి పాల్పడితే ఆ మహిళకు శిరోముండనం చేయించాలని.. లేదంటే రెండు వేళ్లు కత్తిరించాలన్న చట్టాన్ని పక్కాగా రాసేశారు.
ఆడోళ్లే కాదు.. పురుషులు కూడా స్వలింగ సంపర్కానికి పాల్పడితే కుల బహిష్కరణ చేయాలని చెప్పారు. ప్రపంచానికి కామకేళి మీద గ్రంధాన్ని అందించిన వాత్సాయునుడి కామసూత్ర గ్రంథంలోని తొమ్మిదో అధ్యాయంలో స్వలింగ సంపర్కం గురించి.. ఇతర అసహజ లైంగిక కార్యకలాపాల గురించి.. తృతీయ ప్రకృతి (ట్రాన్స్ జెండర్) వారి ప్రస్తావన ఉంది. స్వలింగ సంపర్కానికి పాల్పడే వారికి రాజు దండన విధించాలంటూ కౌటిల్యుడి అర్థశాస్త్రం స్పష్టంగా చెప్పటం చూస్తే.. స్వలింగ సంపర్కం వేల ఏళ్ల కిందటే మనదగ్గర ఉందన్న వైనం స్పష్టమవుతుంది. అంతేకాదు.. ఇలాంటి నేరాలకు ఏం చేయాలన్న క్లారిటీ అప్పటి మనోళ్లకు ఫుల్ గా ఉందన్నది అర్థమవుతుంది.