Begin typing your search above and press return to search.

సిఏఏ పై సుప్రీం లో విచారణ ..!

By:  Tupaki Desk   |   20 Jan 2020 6:38 AM GMT
సిఏఏ పై సుప్రీం లో విచారణ ..!
X
దేశ వ్యాప్తంగా ఎంతో వివాదాస్పదంగా మారిన పౌరసత్వ సవరణ చట్టంపై ఈ రోజు సుప్రీం కోర్టు విచారణ చేపట్టబోతంది. దేశాన్ని మత ప్రాతిపదికన విభజిస్తూ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఈ చట్టాన్ని తీసుకువచ్చారని ఆరోపిస్తున్న వివిధ సంస్థలు, సంఘాలు, రాజకీయ పార్టీలు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ నెల 10 నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై స్టే విధించాలంటూ కూడా కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. వీటి పై కౌంటర్ దాఖలు చేయాలని డిసెంబర్ 18న ఆదేశించిన సుప్రీం కోర్టు అన్ని పిటిషన్ల పై ఇవాళ విచారణ చేపడుతుంది.

ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమంటూ దాఖలైన 150కి పైగా పిటిషన్ల ను ధర్మాసనం ఒకేసారి విచారిస్తుంది. ఈ చట్టానికి వ్యతిరేకంగా కేరళ కూడా సుప్రీంను ఆశ్రయించింది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌ తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత జయరామ్ రమేష్ కూడా సుప్రీంను ఆశ్రయించారు. తమ రాష్ట్రంలో ఈ చట్టాన్ని అమలు చేయబోమంటూ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఇప్పటికే ప్రకటించాయి. అయితే, పౌరసత్వ చట్టం పై ఎవరి ఎన్ని ఆందోళనలు చేసినా వెనక్కి తగ్గేది లేదంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించడం తో సుప్రీం విచారణ పై ఉత్కంఠ నెలకొంది.