Begin typing your search above and press return to search.

ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు షాకిచ్చిన సుప్రీంకోర్టు

By:  Tupaki Desk   |   7 Nov 2022 1:32 PM GMT
ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు షాకిచ్చిన సుప్రీంకోర్టు
X
ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు గట్టి షాకిచ్చింది. ప్రతీ చిన్న దానికి సుప్రీంకోర్టుకు రావడం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు అలవాటుగా మారిందని న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, జస్టిస్ నాగరత్న ధర్మాసనం చురకలంటించింది. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వానికి ఈ తీర్పు మింగుడుపడని వ్యవహారంగా మారింది.

గత చంద్రబాబు ప్రభుత్వంలోని మాజీ మంత్రి నారాయణ ముందస్తు బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. విచారణకు సహకరించకపోతే దర్యాప్తు సంస్థలు న్యాయస్థానాలను ఆశ్రయించాలని సూచించింది. ప్రతీదానికి సుప్రీంకోర్టుకు రావడం ఏంటని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు హితవు పలికింది.

అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పు కేసులో నారాయణకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఆర్థిక నేరాలతో కూడిన కేసు అని.. నిందితులు సీఐడి విచారణకుసహకరించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం తరుఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు.

మీ రాజకీయ ప్రతీకారంలో తమను భాగస్వాములు చేయొద్దు అని సుప్రీంకోర్టు ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. నిందితులు విచారణకు సహకరించకపోతే సీఐడీ బెయిల్ రద్దు పిటీషన్ వేసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ఏపీ సర్కార్ దాఖలు చేసిన పిటీషన్ ను కొట్టివేసింది.

ఏపీ రాజధాని అమరావతి పరిధిలో నిర్మించతలపెట్టిన ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ ను మంత్రి హోదాలో నారాయణ ఉద్దేశపూర్వకంగా మార్చారని.. తన వారికి మేలు చేసేందుకే ఆయన ఈ పనిచేశారంటూ ఏపీ సీఐడీ ఓ కేసు నమోదు చేసింది. ఈకేసులో సీఐడీ అధికారులు చర్యలు మొదలుపెట్టకముందే నారాయణ హైకోర్టును ఆశ్రయించారు. వైద్య చికిత్సల కోసం విదేశాలకు వెళ్లాల్సి ఉందని.. అమరావతి కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన హైకోర్టును కోరారు. కోర్టు అందుకు సానుకూలంగా స్పందించి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

అయితే నారాయణకు హైకోర్టు ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. సోమవారం విచారించిన సుప్రీంకోర్టు బెయిల్ రద్దుకు అంగీకరించలేదు. ఈ చిన్న విషయానికి సుప్రీంకోర్టుకు వస్తారా? అంటూ ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతీకార రాజకీయాలకు సుప్రీంకోర్టును లాగవద్దని ఏపీ ప్రభుత్వంపై మండిపడింది. తెలంగాణ తీరును కూడా కలిపి తప్పుపట్టింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.