Begin typing your search above and press return to search.

పాత నోట్లపై కేంద్రానికి సుప్రీం సూటి ప్రశ్న

By:  Tupaki Desk   |   30 Aug 2019 7:59 AM GMT
పాత నోట్లపై కేంద్రానికి సుప్రీం సూటి ప్రశ్న
X
మోడీ తన గత ప్రభుత్వ హయాంలో ఓ శుభముహార్తాన నల్లడబ్బును వెలికితీయాలనే సదుద్దేశంతో దేశంలో చెలామణీలో ఉన్న పెద్దనోట్లను రద్దు చేశారు. అప్పుడు అందరి ఇళ్లల్లో ఉన్న పాత రూ.1000 - రూ500 నోట్లను బ్యాంకులో జమ చేసిన ప్రజలు - వ్యాపారులు - పారిశ్రామికవేత్తలు వాటి స్థానంలో కొత్త నోట్లను పొందారు.

దేశంలో ప్రజల వద్దనున్న పాత నోట్లను బ్యాంకుల్లో జమ చేయాలని మోడీ సర్కారు - రిజర్వ్ బ్యాంకు టైం బాండ్ ను పెట్టింది. ఓ ఆరు నెలల టైం కూడా ఇచ్చేసింది. అయితే ఆ టైం ముంబైలోని ఓ పారిశ్రామికవేత్తకు సరిపోలేదట.. నిర్ధేశించిన గడువులోగా పాత నోట్లను బ్యాంకులో జమ చేయలేకపోయాడట... తనకు ఇప్పుడు అవకాశం ఇవ్వాలని సుప్రీం కోర్టు గడపతొక్కాడు.

ఎక్కడ దాచాడో.. లేక ఎక్కడైనా దొరికిన సొమ్మో తెలియదు కానీ అక్షరాల కోటి 17 లక్షల పాత నోట్లు తన వద్ద ఉన్నాయని.. వాటిని బ్యాంకులో జమ చేసి కొత్త నగదుగా మార్చుకోవడానికి అవకాశం ఇవ్వాలని ముంబై హైకోర్టును తాజాగా ముంబైకి చెందిన ఓ వ్యాపారి ఆశ్రయించాడు. ఇది విధానపరమైన నిర్ణయమని బ్యాంకులను తాము ఆదేశించలేమని హైకోర్టు కొట్టివేసింది.

దీంతో సవివరంగా తన వద్దనున్న కోటి 17 లక్షల పాత రూ.1000 - రూ.500 నోట్లను బ్యాంకులో జమ చేసేందుకు అవకాశం కల్పించాలని సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఆ పాతనోట్లు ఎక్కడివి? ఇంత ఆలస్యంగా ఎందుకు బయటపడ్డాయి..? సంబంధించిన అన్ని విషయాలను సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటీషన్ లో ముంబై వ్యాపారి పేర్కొన్నాడట.. వ్యాపారి కారణాలు సహేతుకంగానే ఉండడంతో సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. కేంద్రానికి - ఆర్బీఐకి నోటీసులు జారీ చేసింది. రద్దయిన పాత నోట్లను బ్యాంకుల్లో ఎందుకు జమ చేయకూడదో తెలియజేయాలని.. సరైన కారణాన్ని వివరించాలని సుప్రీం కోర్టు సూచించింది.

కేంద్రం కనుక పాతనోట్లను మళ్లీ తీసుకుంటామని చెబితే.. దేశంలో ఇంకా అలమరాలు - అట్టపెట్టలు - ఇంకా ఎక్కడైనా భూమిలో పాతిపెట్టిన పాత నోట్లు బయటకు వచ్చే చాన్స్ ఉంది. మరి పాతనోట్లను తీసుకునే విషయంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.