Begin typing your search above and press return to search.
ఆధార్ లేక పోతే..అన్నం పెట్టరా...సుప్రీం కన్నెర్ర..!
By: Tupaki Desk | 9 Dec 2019 5:30 PM GMTపుట్టుక నుంచి చావు వరకు మనిషికి ఏమున్నా.. ఏమిలేకపోయినా.. ఆధార్ నెంబరు - కార్డు ఉండి తీరాల్సిన పరిస్థితి దాపురించిం ది ఈ దేశంలో! అయితే, వివిధ కారణాలతో వలస కార్మికులు - పేదలు ఇప్పటికీ ఆధార్ కు నోచుకోలేదు. ఒకపక్క సుప్రీం కోర్టు.. ఆధార్ ను ఐచ్చికం చేయాలని ఆదేశించినా.. పట్టించుకునే నాధుడు కనిపించడం లేదు. ఎక్కడి వెళ్లినా.. ఏం కావాలన్నా.. ఆధార్ కావాల్సిందే..! నువ్వు ఎవరు? అంటే ఒకప్పుడు పేరు - ఊరు చెబితే సరిపోయే పరిస్థితి నుంచి నేడు ఆధార్ కార్డును చూపించే దుస్థితికి నవీన భారతం చేరిపోయింది. ప్రజలకు ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల నుంచి స్కూళ్లలో అడ్మిషన్లు - బ్యాంకు అకౌంట్లు ఇలా ఎందెందు చూసినా ఆధార్.. ఇది ఇప్పుడు నిత్యావసరం అయిపోయింది.
ఈ పరిస్థితినే మరోసారి సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఆధార్ లేదనే కారణంగా ఈశాన్య రాష్ట్రం త్రిపురలో పేదల కుటుంబాలకు ప్రభుత్వం ఇస్తున్న రేషన్ ను కొన్నాళ్లుగా నిలిపివేశారు. దీంతో ఆ పేదలకు ఆహారం దక్కక ఒక పూట తింటే మరో పూటలేక. కొందరికి రోజుల తరబడి అన్నమే పుట్టక ఆకలితో అలమటించి కన్ను మూశారు. ఈ నేపథ్యంలో దాఖలైన ఓ పిటిషన్‌పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బొబ్డే.. తీవ్ర అసహనం - ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధార్ ఉంటేనే అన్నం పెడతారా ? అంటూ ప్రభుత్వాలను నిలదీశారు. ఆధార్ లేని కారణంగా నిరుపేదలకు రేషన్ నిలిపేసి.. వారు చనిపోయేందుకు కారణం కావడం ఎంతమాత్రమూ ఉపేక్షించేది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలు ఆకలితో చనిపోయే స్థితిలోకి ప్రభుత్వాలు నెట్టడం సరైనది కాదని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి అన్నారు. కారణం ఏదైనా సరే రేషన్ నిలిపేయడంతో.. ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితికి రావడం దారుణమన్నారు. త్రిపురలోని ఏడు శరణార్థి క్యాంపులకు రేషన్ నిలిపేయడంపై విచారిస్తూ సోమవారం సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ క్యాంపులకు రేషన్ సరఫరా చేయకపోవడంపై రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని ఆదేశించారు.
‘ఆధార్ కార్డు లేని నిరుపేదలకు ప్రభుత్వాలు రేషన్ బియ్యం ఇవ్వడం ఆపేశాయి. దీని వల్ల తిండి లేక ఆకలితో అలమటించి.. బడుగు జీవులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. ఈ ఘటనలపై చర్యలు తీసుకోవాలి’ అంటూ దాఖలైన మరో పిటిషన్ పైనా సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. దీనిపై వివరణ ఇవ్వాలని అన్ని రాష్ట్రాలకు నోటీసులు ఇచ్చింది న్యాయస్థానం. ఆధార్ లేదని రేషన్ నిలిపేయడంతో నిరుపేదలు ఆకలితో మరణించినట్లు వస్తున్న ఆరోపణలపై అఫిడవిట్ ఫైల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. మొత్తానికి ఈ విషయం దేశంలో సంచలనం రేపింది.