Begin typing your search above and press return to search.

ఏపీ కలలకు మళ్లీ ఒడిశా బ్రేకులు

By:  Tupaki Desk   |   3 Aug 2018 11:06 AM GMT
ఏపీ కలలకు మళ్లీ ఒడిశా బ్రేకులు
X
బీజేపీతో తెగతెంపులైపోయిన తరువాత ఎన్నికల కోసం చంద్రబాబు సరికొత్త ప్రణాళికలు అమలు చేస్తున్నారు. అన్న క్యాంటీన్ల ఏర్పాటు.. నిరుద్యోగ భృతిపై ముందుకు కదలడం వంటివన్నీ ఆ కోవలోనివే. జగన్ హవాను తట్టుకుని నిలవడం కష్టమని దాదాపుగా అంచనాకు రావడంతో చంద్రబాబు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. ఇక పోలవరం సంగతికొస్తే 2019కి పూర్తి చేయడం ఎలాగూ కాదు.. దీంతో కేంద్రం నుంచి సహకారం అందకపోవడం - తెలంగాణ - ఒడిశాల నుంచి వస్తున్న ఆటంకాలను చూపించి సింపథీ పొందాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే.. పోలవరాన్ని ముందుకు కదలనివ్వకుండా ఒడిశా ప్రభుత్వం పదేపదే పిటిషన్లు వేసి ఆంధ్రప్రదేశ్‌ ను తెగ చీకాకు పెడుతోంది. దీంతో కేంద్రం నాన్ కోపరేషన్.. చంద్రబాబు చిత్తశుద్ధి లేమికి ఒడిశా అభ్యంతరాలు కూడా తోడవుతూ ఏపీ ప్రజల ఆశలపై నీళ్లు చల్లుతున్నారు.

తాజాగా పోలవరం ప్రాజెక్టుపై ఒడిశా ప్రభుత్వం మరో మధ్యంతర పిటిషన్‌ ను దాఖలు చేసింది. కేంద్ర ప్రభుత్వం పోలవరం స్టాప్‌ వర్క్‌ ఆర్డర్‌ ను పదే పదే నిలుపుదల చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒడిశా ప్రభుత్వం ఈ పిటిషన్‌ ను దాఖలు చేసింది. మూడు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఏపీ - కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. దీంతో ఒరిజినల్‌ సూట్‌ పై విచారణా అంశా లను కేంద్ర - ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయస్థానానికి అందజేశాయి. ఇంకా ఏవైనా కీలక దస్త్రాలు ఉంటే రెండు వారాల్లో అందజేయాలని ఒడిశా ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు పోలవరం ప్రాజెక్టుతో వివిధ రాష్ట్రాల్లో గిరిజనులకు నష్టం వాటిల్లితోందని… రేలా సంస్థ మరో పిటిషన్‌ దాఖలు చేసింది. రేలా సంస్థ ఎవరో - రిజిస్టర్‌ సంస్థయేనా కాదా అన్న వివరాలు తెలియజేయాలని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.

ఇదిలా ఉండగా పోలవరం అంచనాలు మరోసారి సవరిస్తున్నారు. సవరించిన అంచనాలపై సోమవారాని కల్లా సీడబ్ల్యూసీకి నివేదిక అందజేస్తామని ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి శశి భూషణ్‌ తెలిపారు. కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ సమక్షంలో జరిగిన పోలవరం అంచనావ్యయం పెంపు పై సమావేశంలో పోలవరం ప్రాజెక్టు పెంపునకు సంబంధించి పలు వివరాలను ఏపీ అధికారులు అందజేశారు.