Begin typing your search above and press return to search.

గ‌వ‌ర్న‌ర్‌ కు సుప్రీంకోర్టు నోటీసులు

By:  Tupaki Desk   |   20 Nov 2015 4:12 PM GMT
గ‌వ‌ర్న‌ర్‌ కు సుప్రీంకోర్టు నోటీసులు
X
దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన‌ వ్యాపం కుంభకోణం ఇంకా వేడెక్కుతోంది. స‌ర్కారీ కొలువులు సాధించుకునేందుకు ప్ర‌తిభ‌ను న‌మ్ముకోవ‌డం కంటే పైర‌వీల‌ను న‌మ్ముకోవ‌డ‌మే బెట‌ర్ అని భావించిన మ‌ధ్య‌ప్ర‌దేశ్ కు చెందిన యువ‌త ఆలోచ‌న‌లు ప‌లువురు క్యాష్ చేసుకున్నారు. ఈ క్ర‌మంలో చోటా నేత‌ల నుంచి మొద‌లుకొని ఎమ్మెల్యేలు - ఎంపీలు - మంత్రులు - ముఖ్య‌మంత్రులు...ఆఖ‌రికి గ‌వ‌ర్న‌ర్ కూడా త‌న‌దైన శైలిలో పైర‌వీలు చేశారు. ప్ర‌భుత్వ కొలువులు అస్మ‌దీయుల‌కు క‌ట్ట‌బెట్టారు. ఈ త‌తంగం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన నేప‌థ్యంలో స్పెష‌ల్ ఇన్వెష్టిగిష‌న్ టీం ద‌ర్యాప్తు చేప‌ట్టింది.

మ‌రోవైపు కొంద‌రు అభ్య‌ర్థులు - సామాజికవేత్త‌లు కోర్టును ఆశ్ర‌యించారు. ఇందులో భాగ‌స్వామ్యం ఉన్న మధ్య ప్రదేశ్ గవర్నర్ రామ్ నరేశ్ యాదవ్ ను తొలగించాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖ‌లైంది. ఈ పిల్ ను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు కేంద్రం అభిప్రాయాన్ని తెలిపాల్సిందిగా కోరింది. ఈమేర‌కు సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.