Begin typing your search above and press return to search.

బుల్డోజర్లతో భవనాల కూల్చివేత.. స్టే ఇవ్వలేమన్న సుప్రీంకోర్టు

By:  Tupaki Desk   |   16 Jun 2022 10:30 AM GMT
బుల్డోజర్లతో భవనాల కూల్చివేత.. స్టే ఇవ్వలేమన్న సుప్రీంకోర్టు
X
యూపీలో హింసాత్మక ఘటనలు చేస్తున్న వారివి.. రౌడీలు, గుండాల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేస్తోంది యోగి సర్కార్. అక్రమ భవనాలను కూల్చివేస్తూ నేరగాళ్లకు గట్టి షాక్ ఇస్తోంది. ఇటీవల మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మ వ్యాఖ్యలపై యూపీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనల్లో పాల్గొన్న వారి అక్రమ నిర్మాణాలను యూపీ ప్రభుత్వం బుల్డోజర్లతో కూల్చివేసింది.

దేశవ్యాప్తంగా, రాష్ట్రంలో దీనిపై తీవ్ర వ్యతిరేకత వచ్చినా యూపీలోని యోగి సర్కార్ వెనక్కి తగ్గడం లేదు. దీంతో కూల్చివేతలపై కొందరు సుప్రీంకోర్టుకు ఎక్కారు.

కూల్చివేతలపై సమాధానాలు చెప్పాలని యూపీ ప్రభుత్వంతోపాటు ప్రయాగ్ రాజ్, కాన్పూర్ మున్సిపల్ అధికారులు నోటీసులు పంపారు. వచ్చే మంగళవారం తదుపరి విచారణ జరుపుతామని పేర్కొన్నారు. అధికారులు చట్టప్రకారం నడుచుకోవాలని చెప్పారు.

యూపీలోని ప్రయాగ్ రాజ్ లో హింసాత్మక ఘటనలకు ప్రధాన సూత్రధారి అయిన జావేద్ మహ్మద్ ఇంటిని యోగి సర్కార్ కూల్చివేసింది. ఈ నేపథ్యంలోనే గుజరాత్ లోని కచ్ నగరంలో ఓవైసీ భగ్గుమన్నారు.

మాజీ బీజేపీ నేత నుపూర్ శర్మ వ్యాఖ్యలకు నిరసనగా జూన్ 10వ తేదీన ముస్లిం సంఘాలు దేశవ్యాప్తంగా మసీదుల వద్ద ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే యూపీతో సహా పలు రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నారు. పోలీసులు నిరసనకారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

ఘర్షణకు పాల్పడి సంఘ విద్రోహ చర్యలకు పాల్పుడుతున్న వారిపై యూపీ సీఎం యోగి ఉక్కుపాదం మోపుతున్నారు. వారి ఇంటిని బుల్డోజర్లతో కూల్చివేస్తున్నారు. అదే ఇప్పుడు అక్రమార్కుల గుండెల్లో గుబులు రేపుతోంది. సుప్రీంకోర్టులో ప్రభుత్వ చర్యలను ఆపాలని స్టే ఇవ్వలేదు. దీంతో యూపీ సర్కార్ మరింత దూకుడుగా ముందుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.