Begin typing your search above and press return to search.

వారిపై సుప్రీం చిరాకు; చికాకు పెడతారేంటి?

By:  Tupaki Desk   |   2 Sept 2015 10:04 AM IST
వారిపై సుప్రీం చిరాకు; చికాకు పెడతారేంటి?
X
పెరిగిపోతున్న కేసులకు తగ్గట్లే.. గతంతో పోలిస్తే.. కోర్టులకు సంబంధించిన వార్తల కవరేజ్ ఈ మధ్య కాలంలోబాగా పెరిగింది. దీనికి తోడు.. కేసుల విచారణ సమయంలో ఆయా న్యాయమూర్తులు చేస్తున్న వ్యాఖ్యలు సైతం.. అందరి దృష్టిని ఆకర్షించేలా ఉండటంతో వార్తాంశాలుగా మారిపోతున్నాయి.

ఈ క్రమంలో వివిధ కోర్టులలో పాత్రికేయులు మరింత ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. అయితే.. మంగళవారం సుప్రీం కోర్టు ధర్మాసనం (జస్టిస్ రంజన్ గొగోయ్.. జస్టిస్ రమణ) పాత్రికేయులపై చికాకును ప్రదర్శించింది. కోర్టు హాలులో న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యల్ని సేకరించేందుకు కోర్టు హాలులో పాత్రికేయులు ప్రదర్శిస్తున్న ఉత్సాహంపై దర్మాసనం వ్యాఖ్యలు చేసింది.

న్యాయమూర్తుల వ్యాఖ్యల్ని సేకరించేందుకు జడ్జిల వేదికల దగ్గరకు పాత్రికేయులు రావటాన్ని తప్పు పట్టిన ధర్మాసనం.. ఇలాంటి చికాకు పెట్టే చర్యలు చేయొద్దని చెప్పటమే కాదు.. వారికి కేటాయించిన స్థానాల్లోనే ఉండాలని వ్యాఖ్యానించారు. జస్టిస్ రంజన్ గొగోయ్ మాట్లాడుతూ.. కేసు విచారణ సందర్భంగా జరిగే చర్చను.. న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యల్ని రాసేందుకు చాలామంది న్యాయమూర్తులు ఇష్టపడరన్నారు. కేసు విచారణలో భాగంగా తాము చేసే వ్యాఖ్యలు తాత్కలికంగా ఆయన అభివర్ణించారు. మరి.. తాజా వ్యాఖ్యలు రానున్న రోజుల్లో పాత్రికేయులపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో..?