Begin typing your search above and press return to search.
సుప్రీంకోర్టులో మన తెలుగు జస్టిస్ కొత్త రికార్డు
By: Tupaki Desk | 9 May 2018 2:17 PM GMTసుప్రీంకోర్టు సీనియర్ మోస్ట్ జడ్జి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ మరో ప్రత్యేకతకు శ్రీకారం చుట్టారు. సాధారణంగా న్యాయమూర్తులు రిటైరవుతుంటే వాళ్లకు సాదరంగా వీడ్కోలు పలుకుతూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కార్యక్రమం ఏర్పాటుచేస్తుంది. అయితే తన వీడ్కోలు కార్యక్రమానికి తాను రాలేనంటూ చలమేశ్వర్ బార్ అసోసియేషన్‌కు చెప్పారు. ఈ ఏడాది జూన్ 22న చలమేశ్వర్ రిటైర్ కానున్నారు. అయితే మే 19 నుంచి కోర్టుకు వేసవి సెలవులు కావడంతో మే 18నే వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటుచేశారు. చలమేశ్వర్ ఫేర్‌వెల్‌కు రానని చెప్పారని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ వెల్లడించారు. అయితే మరోసారి అసోసియేషన్ కార్యనిర్వాహక వర్గం చలమేశ్వర్‌ను కలిసి.. ఒప్పించాలని భావిస్తున్నది. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాపై తిరుగుబాటు చేసి చలమేశ్వర్ ఈ మధ్య బాగా వార్తల్లో నిలిచారు. మరో ముగ్గురు న్యాయమూర్తులతో కలిసి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై చలమేశ్వర్ సహా మరో ముగ్గురు న్యాయమూర్తులు చేసిన ఫిర్యాదుపై పలు వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ఆరోపణలతో సర్వోన్నత న్యాయస్థానం తన గౌరవాన్ని కోల్పోయిందన్నారు. ఒకసారి ప్రజల విశ్వాసం సన్నగిల్లితే, ఇక అందులో ఏముంటుందని కాంగ్రెస్ నేత, మాజీ న్యాయశాఖ మంత్రి భరద్వాజ్ ఆ సమయంలో ప్రశ్నించారు. న్యాయవ్యవస్థ అనేది ప్రజాస్వామ్యానికి ఓ మూలస్తంభంగా ఉండాలని, అత్యున్నత న్యాయస్థానం ఎలా పనిచేస్తుందన్న అంశాన్ని చూసుకోవాల్సిన బాధ్యత న్యాయశాఖ మంత్రిదే అని హన్సరాజ్ ఆరోపించారు. ఇలా సంచలన పరిణామాలకు జస్టిస్ చలమేశ్వర్ వేదిక అయ్యారు. కాగా, తాజా ఫేర్‌వెల్‌కు వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోతున్నానని ఆయన తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలకు తాను దూరంగా ఉంటానని, ఏపీ హైకోర్టు నుంచి ట్రాన్స్‌ఫర్ అయిన సమయంలోనూ వీడ్కోలు వద్దన్నానని చలమేశ్వర్ చెప్పారు.