Begin typing your search above and press return to search.
వ్యాఖ్యలు వక్రీరణలో సుప్రీం చీఫ్ ను కూడా వదలరా..?
By: Tupaki Desk | 4 Dec 2021 6:13 AM GMTదేశంలో అత్యున్నత న్యాయస్థానం ఆ విషయంలో తీవ్రంగా బాధపడుతోంది. తాము ఒకటి చెబుతుంటే.. మీడియా మరోటి రాస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తోందని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఇటీవల విచారణలో భాగంగా కలత చెందారు. కొన్ని మీడియా సంస్థలు సుప్రీంకోర్టు విషయాల్లోనే ఇలా ప్రవర్తిస్తే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని అన్నారు.
దేశంలో కొన్ని మీడియా సంస్థలు ప్రముఖుల వార్తలు వక్రీకరణ చేస్తూ రాస్తాయనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఇంకేముంటుంది..? అని చర్చించుకుంటున్నారు. ఇంతకీ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ అంతలా బాధపడడానికి కారణం ఏమిటి..? మీడియా ఏమని రాసింది..?
ఢిల్లీని వాయుకాలుష్యం కమ్మేసిన విషయం తెలిసింది. దీంతో ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని సంస్థలు ఇంటినుంచే పనిచేయాలని ఉద్యోగులకు సూచించారు. అనవసరంగా రోడ్లపైకి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. దీనిపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ తరుణంలో విద్యార్థులు మాత్రం పాఠశాలలకు వెళుతున్నారు.
అయితే ‘పనిచేసేవారు ఇంట్లో ఉండగా.. విద్యార్థులు పాఠశాలలకు వెళ్తున్నారు. కార్యాలయాలు, పాఠశాలలు మూసివేస్తామని ఢిల్లీ ప్రభుత్వమే మూసివేస్తుందని చెప్పింది’ సుప్రీం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.
కానీ ఓ ఇంగ్లీష్ పేపర్ మాత్రం ‘ఢిల్లీలో పాఠశాలలు మూసివేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది’ అని వార్తను ప్రచురించింది. దీనిపై చీఫ్ జస్డిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ ‘ఇలా ఎందుకు చేస్తున్నారో తెలియదు. కానీ మరి ఇంతలా వక్రీకరించి రాయాలా..? మీడియా అంటే ఎంతో గౌరవం ఉంటుంది. ఇలా తప్పుడు వార్తలు రాస్తే ఎలా..? ఓ వర్గం మమ్మల్ని విలన్లుగా చూపెడుతోంది.
పాఠశాలలు మూసివేయాలని మేమెక్కడ చెప్పాం.. ఢిల్లీలో అధిక కాలుష్యం ఉన్న సమయంలో విద్యార్థులు పాఠశాలకు వెళ్తున్నారని మాత్రమే చెప్పాం.. కార్యాలయాలు, పాఠశాలలు మూసివేయాలని ఢిల్లీ ప్రభుత్వమే చెప్పింది..’ అని ఎన్వీ రమణ చెప్పారు.
అయితే ఈ విచారణలో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం తరుపున న్యాయవాది సింఘ్వీ జోక్యం చేసుకున్నారు. ఢిల్లీ పరిపాలనను తీసుకుంటామని సుప్రీం కోర్టు హెచ్చరించించినట్లు ఇంగ్లీష్ పేపర్లో వచ్చిన కథనాన్నిసీజే దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై చీఫ్ జస్టిస్ స్పందిస్తూ ‘ఇలాంటి వార్తలను మా దృష్టికి తీసుకొచ్చే ముందు మీరు ఖండించాలి. పత్రిక భావస్వేచ్ఛా హక్కును మేము అడ్డుకోలేం. విలేకరుల సమావేశం ఎవరైనా పెట్టుకోవచ్చు. కానీ మేం పెట్టలేం కదా..? అని త్రిసభ్య ధర్మాసనం సమాధానం తెలిపింది.
ఇదిలా ఉండగా గతంలో ఏపీ హైకోర్టు విషయంలోనూ ఇదే సంఘటన జరిగింది. ఏపీలో మూడు రాజధానుల అంశంపై సాగుతున్న విచారణలో భాగంగా ధర్మాసంన చేసిన కామెంట్స్ పై మీడియాలో కొందరు తప్పుడుగా ప్రచురించడాన్ని హైకోర్టు చీఫ్ జస్టిస్ తప్పుబట్టారు. మీడియా రాజకీయ ఎజెండాలను, హైకోర్టు తీర్పులను సైతం వక్రీకరించడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటి వరకు వ్యక్తుల మాటలనే వక్రీకరించే మీడియా ఇప్పుడు హైకోర్టు వ్యాఖ్యలను కూడా వక్రీకరించడంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో కొందరు మీడియాను నియంత్రించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. మొన్న హైకోర్టు, ఇప్పుడు సుప్రీంకోర్టుల వ్యాఖ్యలు మీడియా వక్రీకరించడంపై కొందరు న్యాయవాదులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.