Begin typing your search above and press return to search.
ఇకపై కోర్టు నోటీసులు వాట్సాప్ లో : సుప్రీం కోర్టు
By: Tupaki Desk | 11 July 2020 2:00 PMదేశంలో కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఎన్ని మార్పులు , చేర్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ తరుణంలోనే దేశ ఆత్యున్యత న్యాయస్థానం సుప్రీం కోర్టు మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటిల్ పద్ధతులతో సమన్లు, నోటీసులను జారీ చేయాలని భావించి, డిజిటల్ పద్ధతుల్ని అమలులోకి తీసుకురావాలని తెలిపింది. మొత్తంగా ఇకపై కోర్టు నోటీసులు, సమన్లను వాట్సాప్, ఈ-మెయిల్, ఫ్యాక్స్ ద్వారా ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు క్లారిటీగా చెప్పింది. దీనికి ప్రధాన కారణం లాయర్లే.
కరోనా సమయంలో లో సంప్రదాయ సమన్లు, నోటీసుల వల్ల కరోనా సోకే ప్రమాదం పెరుగుతోందని లాయర్లు ఆవేదన చెందడంతో ఈ విషయాన్ని సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు డిజిటల్ చేస్తే మంచిది అని భావించి ఆ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఏ బోబ్డే, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, జిస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. కరోనా నేపథ్యంలో కక్షిదారులు , న్యాయవాదులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిని ఆ సమస్యల నుండి తప్పించేందుకు వీలుగా వాట్సాప్ ద్వారా సమాచారాన్ని అందించటం ద్వారా చాలా సమస్యలకు పరిష్కారంగా మారుతుందని భావిస్తున్నారు.
సుప్రీం కోర్టు ఈ నిర్ణయం తీసుకోవడానికి మరో ముఖ్య కారణం .. కరోనా మహమ్మారిని బెడద ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. అలాగే ఈ ఏడాది చివరి వరకు కూడా కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం అయితే లేదు అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం సరైందే అని భావించిన ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే కరోనా నుంచి దూరంగా ఉండేందుకు పలు కంపెనీలు వర్క్ ఫ్రం హోం ఇవ్వగా .. మీటింగుల కోసం జూమ్, జియోమీట్, గూగుల్ మీట్ వంటివి ఉపయోగిస్తున్నారు.