Begin typing your search above and press return to search.
జగన్ కు ఊరటనిచ్చిన సుప్రింకోర్టు తీర్పు
By: Tupaki Desk | 18 Feb 2022 4:41 AM GMTసుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన ఒక తీర్పు జగన్మోహన్ రెడ్డికి ఊరటగా ఉంటుందనే చెప్పాలి. హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు రంగంలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే కేటాయించాలని చట్టం చేసింది.
దీన్ని కొందరు న్యాయస్థానంలో సవాలు చేశారు. కేసును విచారించిన పంజాబ్, హర్యానా ఉమ్మడి హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టేసింది. దీంతో హర్యానా ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. కేసును విచారించిన సుప్రీంకోర్టు తాజాగా హైకోర్టు తీర్పును కొట్టేసింది.
అయితే 75 శాతం ఉద్యోగాలు కల్పించటంలో ప్రైవేటు రంగంపై ఒత్తిడి తీసుకురావద్దని హర్యానా ప్రభుత్వానికి స్పష్టంగా ఆదేశాలిచ్చింది. సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు జగన్ కు ఊరటనిచ్చేదిగా ఉంటుందనటంలో సందేహం లేదు. ఎందుకంటే గతంలో రాష్ట్రంలోని ప్రైవేటు రంగంలో 75 శాతం స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలని చట్టం చేసింది. దీన్ని ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతు కొందరు కోర్టులో కేసులు కూడా వేశారు.
అయితే ఆ కేసుల విచారణ ఏ దశలో ఉందో కూడా ఇపుడు ఎవరు చెప్పలేరు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టం ఆధారంగానే తమిళనాడు, మహారాష్ట్ర ప్రభుత్వాలు స్ధానికులకు 75 శాతం ఉద్యోగాలనే చట్టాలు చేశాయి. ఆ రాష్ట్రాల్లో ఈ చట్టం అమలు ఏ విధంగా ఉందో తెలీదు కానీ ఏపీలో మాత్రం కోర్టు కేసుల కారణంగా అడ్డంకులు వచ్చేశాయి. ఇపుడు సుప్రీంకోర్టు తీర్పుతో ఏపీలో జగన్ కు పెద్ద రిలీఫ్ వచ్చినట్లే అనుకోవాలి.
మరి తాజా తీర్పు నేపథ్యంలో 75 శాతం ఉద్యోగాల రిజర్వేషన్ చట్టం అమలుకు జగన్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. జగన్ చేసిన చట్టం ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు మంచి అవకాశమనే చెప్పాలి. సుప్రీంకోర్టు తీర్పు కారణంగా మరి ఇక్కడ హైకోర్టులో కూడా విచారణను స్పీడు చేసి చట్టం అమలుకు చర్యలు తీసుకుంటే బాగుంటుంది.
అయితే, సుప్రీంకోర్టు చేసిన ఒక కామెంట్ ను గమనించాలి. 75 శాతం కోసం కంపెనీపై ఒత్తిడి తేవద్దు అంది. అంటే క్వాలిటీ మ్యాన్ పవర్ ను ఎంచుకోవడం కంపెనీ హక్కు. అలాంటిది దొరకనపుడు వారు ఎక్కడ నైపుణ్యం ఉంటే అక్కడ ఎంపిక చేస్తారు. కాబట్టి ఒత్తిడి చేయడం వల్ల కంపెనీ తరలిపోయి ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందని గమనించాలి.