Begin typing your search above and press return to search.
కశ్మీర్ ఇష్యూ: కేంద్రానికి సుప్రీం నోటీసులు
By: Tupaki Desk | 28 Aug 2019 9:56 AM GMTఆర్టికల్ 370 రద్దు చేసి కశ్మీర్ ను విభజించి దూకుడుగా ముందుకెళ్తున్న కేంద్రానికి సుప్రీం కోర్టు జలక్ ఇచ్చినట్టైంది. కశ్మీర్ ను విభజించడం.. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన 14 పిటీషన్లపై విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు అంగీకరించడం సంచలనంగా మారింది.
కేంద్రంలోని బీజేపీ రాజ్యాంగబద్దంగా పార్లమెంట్ లో ఓటింగ్ - చర్చతో కశ్మీర్ విలీనాన్ని పూర్తి చేసింది. అయితే దీనిపై దాదాపు 14మంది కోర్టుకు వెళ్లగా.. ఈ పిటీషన్లపై విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు సిద్ధమైంది. ఈ మేరకు పిటీషన్లపై సమాధానం ఇవ్వాలని కేంద్రానికి రెండు నోటీసులు జారీ చేసింది. ఏడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని కోరింది.
అంతేకాదు.. కశ్మీర్ విభజన ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించిన అన్ని పిటీషన్లపై అక్టోబర్ నుంచి విచారించేందుకు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం బెంచ్ ను ఏర్పాటు చేస్తూ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం కేంద్రాని శరాఘాతంగా మారింది.
కశ్మీర్ బిల్లులను పార్లమెంట్ లో ఆమోదం పొందించి విభజించిన కేంద్రానికి ఇప్పుడు సుప్రీం విచారణకు స్వీకరించడం పెను విఘాతంగా మారింది.
అయితే సుప్రీం ఈ పిటీషన్లను విచారణకు స్వీకరించద్దని కేంద్రం కోరింది. సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేస్తే అది అంతర్జాతీయ ప్రభావాలకు దారితీస్తోందని.. వెంటనే నోటీసులు ఉపసంహరించుకొని విచారించకూడదని కేంద్రం సుప్రీం కోర్టు ఎదుట వాదించింది. అయితే దీన్ని సుప్రీం బెంచ్ తోసిపుచ్చింది. కశ్మీర్ విభజన ఆర్టికల్ 370పై విచారణకే మొగ్గుచూపింది..
ఇక కశ్మీర్ లో రాజకీయ నాయకుల నిర్బంధాన్ని సడలించాలని.. ఆ నేతలను కలుసుకునే వెసులుబాటు ఇవ్వాలని సూచించింది. సీపీఎం నేత సీతారం ఏచూరికి కశ్మీర్ నేతలను కలుసుకునే స్వేచ్ఛ ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది. కశ్మీర్ లో మీడియాపై ఆంక్షలను సడలించాలని కేంద్రానికి సూచించింది. దేశంలోని పౌరులంతా స్వేచ్ఛగా కశ్మీర్ వెళ్లేలా వాతావరణం ఉండాలని కేంద్రానికి స్పష్టం చేసింది.