Begin typing your search above and press return to search.

మార‌టోరియం వ‌డ్డీ భారంపై సుప్రీం ఆగ్ర‌హం.. ఆర్బీఐ, కేంద్రానికి నోటీసులు

By:  Tupaki Desk   |   27 May 2020 7:30 AM GMT
మార‌టోరియం వ‌డ్డీ భారంపై సుప్రీం ఆగ్ర‌హం.. ఆర్బీఐ, కేంద్రానికి నోటీసులు
X
లాక్‌డౌన్ కార‌ణంగా ప్ర‌జ‌లంద‌రూ ఉపాధి కోల్పోయి ఆదాయం, రాబడి లేకుండాపోయింది. దీంతో ఉన్న పొదుపును తీసి వాడుకుంటున్నారు. ఈ స‌మ‌యంలో వారికి ఉన్న రుణాలకు వాయిదాలు చెల్లించ‌లేని ప‌రిస్థితి ఉంది. నెల‌స‌రి వాయిదాలు చెల్లించ‌లేక‌పోతున్నారు. అలాంటి వారికోసం కేంద్ర ప్ర‌భుత్వం మార‌టోరియం విధించి కొంత ఉప‌శ‌మ‌న చ‌ర్య తీసుకుంది. నెల‌వారీ ఈఎంఐలు చెల్లించ‌డం క‌ష్ట‌మ‌వుతుంద‌నే ఉద్దేశంతో రిజ‌ర్వ్ బ్యాంక్ మార‌టోరియం విధించింది.

మొద‌ట మూడు నెలలు.. ఇప్పుడు మ‌రో మూడు నెల‌‌ల పాటు మార‌టోరియం విధించింది. కొన్నాళ్లు ఈఎంఐలు వాయిదా ప‌డ్డాయ‌ని సంతోషిస్తున్నారు. కానీ వారికి వాస్త‌వ విష‌యం మాత్రం మ‌ర‌చి పోతున్నారు. ఈఎంఐలు చెల్లించ‌వ‌ద్ద‌ని ఆర్బీఐ ప్ర‌క‌టించింది. కానీ దానికి విధించే వ‌డ్డీ మాత్రం వాయిదా వేయ‌లేదు. ఈ మూడు నెల‌ల ఈఎంఐని అస‌లులోకి క‌లిపేసి దాని మీద వ‌డ్డీ వ‌సూలు చేయాల‌ని నిర్ణ‌యించారు. చివ‌ర్లో అద‌నంగా మూడు నెల‌లు కాకుండా ఏడెనిమిది నెల‌ల ఈఎంఐ భారం ప‌డ‌నుంది. ఈ విష‌యం తెలిస్తే ఈఎంఐలు చెల్లించ‌డ‌మే మేల‌ని భావించే ప‌రిస్థితి.

ప్ర‌స్తుత ఇబ్బందుల‌ను గుర్తించి కొన్నాళ్లు ఈఎంఐలు వాయిదా వేస్తే త‌ర్వాత వ‌డ్డీ అంత పెద్ద‌మొత్తంలో చెల్లించ‌లేమ‌ని కొంద‌రు భావిస్తుండ‌గా.. మ‌రికొంద‌రు ఇప్పుడు బ‌త‌క‌డ‌మే క‌ష్టం.. భవిష్య‌త్‌లో వ‌డ్డీ భారం చెల్లించుకుంటామ‌ని చెబుతూ ఇప్పుడు ఈఎంఐలు చెల్లించ‌డం లేదు. మార‌టోరియం లో ఇలాంటి మెలిక పెట్ట‌డంతో సుప్రీంకోర్టులో ఓ పిటిష‌న్ దాఖ‌లైంది.

రుణ వాయిదాలపై కూడా బ్యాంకులు వడ్డీని వసూలు చేయడాన్ని సవాల్ చేశారు. ఆ పిటిష‌న్ మీద న్యాయ‌స్థానం విచార‌ణ చేప‌ట్టింది. ఈ మేర‌కు సుప్రీంకోర్టు మంగ‌ళ‌వారం కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐకి సుప్రీంకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఇలాంటి సంక్షోభ సమయంలో ఇప్పుడు రుణ చెల్లింపుదారుల‌కు ఉప‌శ‌మ‌నం అవసరమని, కానీ చెల్లించని వాయిదాలపై వడ్డీ వేస్తూ చక్రవడ్డీతో వెన్ను విరుస్తున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేస్తూ ఆ నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌ట్టింది. అలా చేయ‌కుండా బ్యాంకులకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది సుప్రీం ధర్మాసనాన్ని అభ్యర్ధించారు.

లాక్‌డౌన్‌ తో ప్రజలు ఆదాయం కోల్పోయార‌ని ఇలాంటి ప‌మ‌యంలో మారటోరియం విధించి రుణ వాయిదాలపై బ్యాంకులు వడ్డీ వసూలు చేయడం అన్యాయమని పిటిష‌న‌ర్ కోర్టుకు విన్న‌వించారు. మెలిక‌లేమీ లేకుండా మార‌టోరియం అమ‌లుచేయాల‌ని, అద‌న‌పు వ‌డ్డీ భారం మోప‌కుండా చేయాల‌ని కోరారు. ఈ పిటిషన్‌ పై వచ్చే వారం విచారణ కొనసాగనుంది.