Begin typing your search above and press return to search.

కెసిఆర్ సర్కార్ కి అదిరిపోయే దెబ్బ

By:  Tupaki Desk   |   17 Aug 2016 9:36 AM GMT
కెసిఆర్ సర్కార్ కి అదిరిపోయే దెబ్బ
X
తెలంగాణ ప్ర‌భుత్వానికి - సీఎం కేసీఆర్‌ కు కోర్టుల నుంచి మొట్టికాయ‌లు ప‌డుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ క్ర‌మంలో అదిరిపోయే దెబ్బ ఒక‌టి త‌గిలింది కేసీఆర్ స‌ర్కారుకి! రాష్ట్రంలో రానున్న 20 ఏళ్ల‌పాటు త‌మ పార్టీయే అధికారంలో ఉండాల‌ని, విప‌క్షాల‌న్న‌వే లేకుండా చేయాల‌ని వ్యూహం ర‌చించి.. ఆ మేర‌కు ఆక‌ర్ష్ దెబ్బ‌తో అన్ని ప్రధాన పార్టీల‌కూ చెమ‌టలు ప‌ట్టించారు కేసీఆర్‌. వ‌చ్చిన వాళ్ల‌ని కాద‌న‌కుండా కాంగ్రెస్ స‌హా టీడీపీ నేత‌ల‌ను కారెక్కించేసుకున్నారు. ఓ ర‌కంగా త‌మ‌ను అడిగే వారు ఎవ‌రున్నారని కూడా కేసీఆర్ భావించార‌ని స‌మాచారం. అయితే, ఇప్పుడు ఈ నిర్ణ‌యమే సుప్రీం కోర్టు రూపంలో షాకిస్తోంది. టీడీపీ - కాంగ్రెస్‌ ల నుంచి వ‌చ్చిన ఎంపీలు - ఎమ్మెల్యేల‌కు కేసీఆర్ కండువా క‌ప్పేసిన సంగ‌తి తెలిసిందే. టీడీపీ విష‌యంలో అయితే, మొత్తానికి ఆపార్టీ టీఆర్ ఎస్‌ లో విలీనం అయిపోయింద‌ని కూడా ప్ర‌క‌టించేశారు తెలంగాణ అసెంబ్లీ స్పీక‌ర్ మ‌ధుసూద‌నాచారి.

అయితే, కాంగ్రెస్ నేత‌ల జంపింగ్‌ పైనే ఇప్పుడు సుప్రీం ఆయ‌న‌ను బోనెక్కించ‌బోతోంది! త‌మ పార్టీలో గెలిచి, కారెక్కిన ఎమ్మెల్యేల‌ను అన‌ర్హులుగా ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేస్తూ.. కాంగ్రెస్‌కు చెందిన మ‌హ‌బూబ్‌ న‌గ‌ర్ జిల్లా అలంపూర్ ఎమ్మెల్యే సంప‌త్‌ కుమార్ స్పీక‌ర్ మ‌ధుసూద‌నాచారికి ఫిర్యాదు చేశారు. అయితే, ఈ విష‌యంలో స్పీక‌ర్‌ కు ఉన్న స్వేచ్ఛ‌ను పూర్తిగా వాడుకుందామ‌నుకున్న మ‌ధుసూద‌నాచారి ఈ పిటిష‌న్‌ పై మౌనం వ‌హించారు. దాదాపు రెండు నెల‌లు గ‌డిచినా సంప‌త్ పిటిష‌న్‌ ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేదు. దీంతో చిర్రెత్తిన సంప‌త్ ఈ విష‌యాన్ని సుప్రీం కోర్టుకు లాగారు.

త‌మ పార్టీ కాంగ్రెస్ నుంచి అత్య‌ధిక మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యేల‌ను కేసీఆర్ ఆక‌ర్ష్ మంత్రంతో లాగేసుకున్నార‌ని, దీనిలో కేవ‌లం రాజ‌కీయ ల‌బ్ధి - కాంగ్రెస్‌ ను ఒంట‌రిని చేయాల‌నే దుర్బుద్ధి ఉన్నాయ‌ని పేర్కొన్న ఆయ‌న‌.. స‌ద‌రు ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేసేలా స్పీక‌ర్‌ కు సూచించాల‌ని సుప్రీం కోర్టును అభ్య‌ర్థించారు. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు చ‌ట్టం ప్ర‌కారం అన‌ర్హ‌త వేటు విష‌యంలో స్పీక‌ర్ కు పూర్తిస్థాయిలో విచ‌క్ష‌ణ ఉంది. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న సుప్రీం గ‌డప తొక్క‌డం.. గ‌మ‌నార్హం. అయితే, దీనిని అప్ప‌ట్లో టీఆర్ ఎస్ నేత‌లు సీరియ‌స్‌ గా తీసుకోలేదు. కానీ, ఉన్న‌ప‌ళంగా సుప్రీం కోర్టు సంప‌త్ పిటిష‌న్‌ ను విచార‌ణ‌కు స్వీక‌రించింది. దీనిపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కోరుతూ.. ఏకంగా స్పీక‌ర్ మ‌ధుసూద‌నాచారికి నోటీసులు పంపింది.

ఈ స‌డెన్ సిట్యుయేష‌న్‌ తో మ‌ధుసూద‌నాచారి క‌న్నా ముందు సీఎం కేసీఆర్ షాక్‌ కు గుర‌య్యార‌ని కాంగ్రెస్ నేత‌లు విమ‌ర్శ‌లు మొద‌లెట్టేశారు. అంతేకాదు, వాళ్లు మంచి ఖుషీగా కూడా ఉన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీ ఫిరాయింపుల‌పై ఏం చేయాలోతెలియ‌ని స‌మ‌యంలో సుప్పీం నోటుసులు త‌మ‌ను ఆదుకుంటాయ‌ని వారు భావిస్తున్నారు. మ‌రి ఇదే విషయం ఇప్పుడు టీడీపీలోనూ హ్యాపీ నింప‌నుంది. వీళ్లు కూడా త‌మ పార్టీ ఎమ్మెల్యేల‌పై సుప్రీంను ఆశ్ర‌యించే అవ‌కాశం ఉంది. ఏదేమైనా.. ఆక‌ర్ష్‌.. అనుకున్నంత వీజీ కాద‌ని ఇప్పుడు టీఆర్ ఎస్ నేతలు అనుకుంటున్నార‌ట‌. మ‌రి స్పీక‌ర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.