Begin typing your search above and press return to search.

ట్విట్టర్​కు సుప్రీంకోర్టు నోటీసులు.. అజమాయిషీ ఓ వ్యవస్థ కావాలి

By:  Tupaki Desk   |   12 Feb 2021 11:30 AM GMT
ట్విట్టర్​కు సుప్రీంకోర్టు  నోటీసులు.. అజమాయిషీ ఓ వ్యవస్థ కావాలి
X
ఇటీవల ట్విట్టర్​పై కేంద్రంలోని బీజేపీ సర్కారు కోపంగా ఉన్న విషయం తెలిసిందే. కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా రైతులు కొంతకాలంగా ఉద్యమిస్తున్నారు. వాళ్ల ఉద్యమానికి ట్విట్టర్​ వేదికగా పలువురు అంతర్జాతీయ సెలబ్రిటీలు.. మనదేశంలోని ప్రముఖులు మద్దతు తెలిపారు. రైతు ఉద్యమానికి మద్దతు అనే నెపంతో కొందరు దేశ సమైఖ్యతకు భంగం వాటిల్లేలా పోస్టులు పెడుతున్నారన్నది బీజేపీ ఆరోపణ. ఈ నేపథ్యంలో

ట్విట్టర్‌లో దేశ వ్యతిరేక, దేశద్రోహ పోస్టులను గుర్తించేందుకు ఒక ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు దిశగా కేంద్ర ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయాలని కోరుతూ బీజేపీ నేత వినిత్ గోయెంకా సుప్రీంకోర్టు లో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

దీంతో సుప్రీంకోర్టు కేంద్రానికి, ట్విట్టర్​ సహా పలు సంస్థలకు నోటీసులు ఇచ్చింది.
పిటిషనర్ తరఫు లాయర్​ అశ్విని దూబే వాదిస్తూ... ట్విట్టర్​లో విద్వేష పూరిత పోస్టులను గుర్తించేందుకు ఓ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు. దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించేలా కొందరు ట్విట్టర్​లో పోస్టులు పెడుతున్నారని.. ఇది మనదేశ చట్టాలకు విరుద్ధం అని తెలిసి కూడా ట్విట్టర్​ ఇటువంటి పోస్టులను అంగీకరిస్తున్నదని ఆయన సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ట్విట్టర్​ లాంటి సంస్థలు కేవలం లాభాపేక్షతోనే పనిచేస్తాయి. అటువంటి సంస్థలను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కొంతకాలంగా ట్విట్టర్​కు కేంద్రప్రభుత్వానికి వార్​ నడుస్తోంది.

రైతు ఉద్యమంలో పాల్గొన్న నాయకుల ఖాతాలు, సెలబ్రిటీల ట్వీట్లపై గతంలో కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ ఖాతాలను నిలిపివేయాల్సిందిగా ట్విట్టర్‌ను ఆదేశించింది. అయితే కేంద్రం ఆదేశాలను ట్విట్టర్​ పట్టించుకోకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఆగ్రహంగా ఉన్న విషయం తెలిసిందే.