Begin typing your search above and press return to search.
వారు అలా అనొద్దు.. వీరు నొచ్చుకోవొద్దుః సుప్రీం
By: Tupaki Desk | 1 May 2021 9:30 AM GMTదేశంలో కొవిడ్ కల్లోలం కొనసాగుతున్న వేళ పలు హైకోర్టులు.. రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సౌకర్యాలు లేక ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోవట్లదని, పరిస్థితిని అదుపు చేయడం మీకు చేతనవుతుందా? లేదా? అని ఘాటుగా మందలించాయి. ఈ వ్యాఖ్యలపై తాజాగా సుప్రీం కోర్టు స్పందించింది.
దేశంలో కొవిడ్ పరిస్థితులను సమీక్షించేందుకు, కరోనా నియంత్రణపై జాతీయ విధానం రూపొందించేందుకు సుప్రీం సుమోటోగా విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఢిల్లీ, మద్రాస్ హైకోర్టులు చేసిన వ్యాఖ్యలను పలువురు సీనియర్ న్యాయవాదులు సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు.
హైకోర్టుల వ్యాఖ్యలను పరిశీలించిన అత్యున్నత ధర్మాసనం.. కేసు విచారణ సందర్భంగా దానిపైనే దృష్టి పెడితే బాగుంటుందని చెప్పింది. అనవసర వ్యాఖ్యానాలు చేయాల్సిన అవసరం లేదని సూచించింది. ఇలాంటి వ్యాఖ్యానాలు చూపే ప్రభావం ఎక్కువగా ఉంటుందని, అధికారులు అసలే పనిచేయట్లేదని ప్రజలు భావించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. సున్నితమైన అంశాల్లో సమయనం పాటించాలని సూచించింది.
అయితే.. మరోవైపు హైకోర్టులకు ఊరటనిచ్చేలా కూడా వ్యాఖ్యానించింది సుప్రీం. నిజమైన సమాచారం రాబట్టేందుకు కొన్నిసార్లు కఠిన వ్యాఖ్యలు చేస్తుంటాయని, దానికి బాధపడాల్సిన అవసరం లేదని కూడా సుప్రీం పేర్కొనడం గమనించాల్సిన అంశం. మొత్తానికి.. ఇరు వర్గాలూ బాధ్యతగా నడుచుకోవాలని సుప్రీం సూచించింది.