Begin typing your search above and press return to search.

జగన్ అక్రమాస్తుల కేసు : నిజాలు దాచేస్తే దాగవు అంటూ సుప్రీం కీలక వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   18 Nov 2022 4:30 PM GMT
జగన్ అక్రమాస్తుల కేసు : నిజాలు దాచేస్తే దాగవు అంటూ సుప్రీం కీలక వ్యాఖ్యలు
X
నిజం నిప్పులాంటిది. ఎంతటి ఆధునిక కాలం అయినా మరెంతలా నైతిక విలువలు పతనం అవుతున్నా కూడా నిజం మాత్రం దాచేస్తే దాగేది కాదు అది బయటపడుతుంది. సత్యమేవ జయతే అని చాటి చెబుతుంది. ఇవే వ్యాఖ్యలను సుప్రీం కోర్టు తాజాగా చేసింది. అది కూడా ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో నిందితులుగా సీబీఐ చేర్చి చార్జి షీటు హెటెరో సంస్థకు సంబంధించి సుప్రీం కోర్టులో పిటిషన్ విచారణకు వచ్చిన సందర్భంగా ఈ కీలక కామెంట్స్ చేసింది.

విషయానికి వస్తే హెటిరో అరబిందో సంస్థలకు సంబంధించి సీబీఐ చార్జిషీటు దాఖలు చేసి శ్రీనివాస్‌రెడ్డి, హెటిరో సంస్థను నిందితులుగా చేర్చింది. దాని మీద తనను హెటిరో సంస్థను నిందితుల జాబితా నుంచి తొలగించాలని కోరుతూ హెటిరో దాఖలు చేసుకున్న పిటిషన్ని హై కోర్టు కొట్టేసింది. దాంతో సుప్రీం ని హెటిరో ఆశ్రయించింది.

దీని మీద తాజాగా జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు హెటిరో క్వాష్ పిటిషని ని తోసిపుచ్చుతూ నిజాలు దాచేస్తే దాగవంటూ వ్యాఖ్యానించడం విశేషం. అందువల్ల హెటిరో సంస్థ విచారణను తప్పనిసరిగా ఎదుర్కోవాల్సిందే అని పేర్కోంది. ఇదిలా ఉండగా ఈ కేసు విషయం ఏమిటి అంటే హెటిరో, అరబిందో సంస్థలకు జడ్చర్ల సెజ్‌లో భూ కేటాయింపులు చేసిన దాని మీద సీబీఐ కేసు పెట్టి చార్జి షీటు నమోదు చేసింది.

జగన్ సంస్థ అయిన జగతిలో జగన్ పైసా కూడా పెట్టుబడి పెట్టకుండా మిగిలిన సంస్థలతో పెట్టుబడులు పెట్టించారు అని సీబీఐ తన దర్యాప్తులో కనుగొంది. జగతిలో ఇతరులతో 1246 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టినారని సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. వాటిని సాక్ష్యాలతో సహా అన్నీ చేర్చింది.

ఇక పోతే జగతి సంస్థ వాటాలను కేవలం కుటుంబ సభ్యులకే తప్ప ఇతరులకు విక్రయించకూడని నిబంధన ఉంది. అయినా సరే ఇతర సంస్థలకు వాటాలు ఇచ్చారు. ఇక్కడ చిత్రమేంటి అంటే 246 కోట్ల రూపాయలు వాటా ఉన్న అరబిందో హెటిరో సంస్థలకు కేవలం 30 శాతం వాటా మాత్రమే ఇచ్చి కేవలం 73 కోట్లు పెట్టుబడులు పెట్టి జగన్ 70 శాతం వాటా పొందారని కూడా సీబీఐ పేర్కొంది. ఈ 73 కోట్ల రూపాయలు కూడా జగన్ కి చెందిన సండూర్, కార్మెల్‌ ఏసియా సంస్థల నుంచి తెచ్చారు.

అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ఆ సంస్థలలో కూడా ఆ మొత్తాలను ఇతరులే పెట్టుబడిగా పెట్టారని సీబీఐ కనుగొంది. అంటే కేవలం ఒక్క రూపాయి కూడా పెట్టుబడులు పెట్టకుండా జగన్ జగతి సంస్థలో 70 శాతం వాటాను తీసుకున్నారు అన్నది సాక్ష్యాలతో సహా సీబీఐ నిరూపించింది. దీని వెనక అధికార దుర్వినియోగం, ప్రజా విశ్వసనీయతను దెబ్బతీయడం అన్నవి అవినీతి నిరోధక చట్ట పరిధిలోకి వస్తాయని సీబీఐ పేర్కొంది.

అయితే ఈ కేసు విషయంలో తనను నిందితుల జాబితా నుంచి తొలగించాలని హెటిరో సంస్థ పెట్టుకున్న పిటిషన్ని గత ఏడాది ఇదే నవంబర్ లో హై కోర్టు తిరస్కరించింది. ఇపుడు సుప్రీం కోర్టు కూడా అదే పని చేయడమే కాదు నిజాలు దాచేస్తే దాగవు అంటూ చేసిన కామెంట్స్ తో జగన్ అక్రమాస్తుల కేసులో కొత్త మలుపులు తిరిగే అవకాశం ఉంది అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.