Begin typing your search above and press return to search.

శేషాచలం ఎన్‌ కౌంటర్‌ పై సుమోటో లేనట్లే..

By:  Tupaki Desk   |   9 April 2015 4:22 PM IST
శేషాచలం ఎన్‌ కౌంటర్‌ పై సుమోటో లేనట్లే..
X
శేషాచలం కొండల్లో ఎర్రదొంగల ఎన్‌ కౌంటర్‌ వ్యవహారంలో సుప్రీంకోర్టు స్వయంగా జోక్యం చేసుకుని సుమోటోగా కేసు స్వీకరిస్తుందని చాలామంది భావించారు. అయితే... అలాంటి సూచనలేమీ కనిపించలేదు. తాజాగా ఈ కేసు సుప్రీం దృష్టికి వచ్చింది. గతంలో కొన్ని నకిలీ ఎన్‌ కౌంటర్ల విషయంలో సుప్రింకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపద్యంలో శేషాచలం అడవులలో జరిగిన ఎన్‌ కౌంటర్‌ విషయంలో కోర్టు ఎలా స్పందిస్తునేది అందరిలో చర్చనీయాంశమవుతోంది.

తమిళనాడు కు చెందిన కృష్ణమూర్తి అనే న్యాయవాది దీనిపై సుప్రింకోర్టుకు నోట్‌ సమర్పించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డీజీపీ కుమ్మక్కై ఈ ఎన్‌ కౌంటర్‌ చేయించారని... అమాయక తమిళుల ప్రాణాలు బలిగొన్నారని కృష్ణమూర్తి తన ప్రస్తావన పత్రంలో ఆరోపించారు. ఈ వ్యవహారంలో సుప్రింకోర్టు జడ్జి తో విచారణ జరగాలని, సిబిఐ విచారణ చేయాలని, హత్య కేసు నమోదు చేయాలని కోరారు. తాము కోరుతున్నామని అన్నారు. సుప్రింకోర్టు ఛీఫ్‌ జస్టిస్‌ దత్తు దీనిపై స్పందిస్తూ పిటిషన్‌ వేస్తే విచారణకు స్వీకరిస్తామని చెప్పారు. పిటిషన్‌ వేస్తే విచారిస్తామని చెప్పడంతో కోర్టే స్యయంగా దీన్ని స్వీకరించే అవకాశం లేనట్లు అర్థమవుతోంది.