Begin typing your search above and press return to search.
ప్రజాస్వామ్యమా.. ఊపిరి పీల్చుకో.. దేశద్రోహం చట్టంపై సుప్రీం స్టే!
By: Tupaki Desk | 11 May 2022 7:25 AM GMTహనుమాన్ చాలీసా పఠిస్తే.. దేశద్రోహం. ప్రధాని మోడీ విధానాలను విమర్శిస్తే.. దేశ ద్రోహం కేసు. దేశాన్ని కాషాయమయం చేస్తున్నారంటే.. దేశద్రోహం. ఇలా.. నించున్నా.. కూర్చున్నా.. దేశద్రోహం.. దేశద్రోహం.. అంటూ.. పాట పాడుతున్న కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుకు సుప్రీం కోర్టు భారీ షాక్ ఇచ్చింది. అదేసమయంలో ప్రజాస్వామ్యంలో కీలకమైన భావప్రకటనా స్వేచ్ఛకు మరోసారి గొడుగు పట్టింది. కొన్ని దశాబ్దాలుగా.. తీవ్ర చర్చనీయాంశంగా ఉన్న దేశద్రేహం చట్టం అమలును.. సుప్రీం కోర్టు తాజాగా నిలిపివేసింది.
దేశద్రోహం చట్టం 124ఏ అమలుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. 124ఏ పై కేంద్రం పునః పరిశీలన పూర్తై య్యే వరకు ఈ సెక్షన్ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేసులు నమోదు చేయొద్దని పేర్కొంది. దేశద్రోహం చట్టం అమలుపై సుప్రీంకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఎలాంటి కేసులు నమోదు చేయవద్దని, ఇప్పటికే నమోదైన కేసుల్లో చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది.
124ఏ పై కేంద్రం పునః పరిశీలన పూర్తయ్యే వరకు ఈ సెక్షన్ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేసులు నమోదు చేయొద్దని పేర్కొంది. మానవ హక్కులు, దేశ సమగ్రత మధ్య సమతుల్యతను పాటించాల్సిన అవసరం ఉందని పేర్కొంది సిజేఐ ధర్మాసనం. అంతకు ముందు.. దేశద్రోహం కేసులను తాత్కాలికంగా ఎందుకు నిలిపివేయకూడదో చెప్పాలని సుప్రీం కోర్టు ఆదేశించిన క్రమంలో వివరణ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.
దేశ ద్రోహ చట్టాన్ని పునఃపరిశీలించే వరకు కొన్ని చర్యలు తీసుకోవచ్చని, అందుకోసం ప్రభుత్వం నుంచి కొన్ని సూచనలను ధర్మాసనం ముందు ఉంచుతున్నట్లు కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు.
దేశద్రోహ చట్టం నమోదు చేయాలంటే ఎస్పీ స్థాయి అధికారి అనుమతి తీసుకోవాలన్నారు. రాజద్రోహం సెక్షన్ 124ఎ రాజ్యాంగబద్ధతపై దాఖలైన పిటిషన్లపై సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టగా.. కేంద్ర తరఫున తుషార్ మెహతా వాదనలు వినిపించారు.
రాజద్రోహం వ్యవహారంలో గుర్తించదగిన నేరం విషయంలో ఎఫ్ఐఆర్ నమోదును ఆపలేమని కోర్టుకు తెలిపారు సొలిసిటర్ జనరల్ మెహతా. పెండింగ్లో ఉన్న దేశద్రోహం కేసులను కోర్టుల ముందే పెండింగ్లో ఉన్నాయని, కోర్టులే నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. దేశద్రోహానికి సంబంధించిన కేసుల్లో బెయిల్ దరఖాస్తుపై సత్వర విచారణకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.