Begin typing your search above and press return to search.
బ్రేకింగ్: మహారాష్ట్రలో రేపే బలనిరూపణ
By: Tupaki Desk | 26 Nov 2019 5:32 AM GMTమహారాష్ట్ర రాజకీయం కీలక మలుపు తిరిగింది. రాత్రికి రాత్రి ఎన్సీపీని చీల్చి ఉదయం సరికే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది బీజేపీ. అప్పటిదాకా పొత్తుల సంసారంతో గద్దెనెక్కుదామని కలలుగన్న శివసేన - ఎన్సీపీ - కాంగ్రెస్ ఆశలను అడియాసలు చేసింది. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.
ఇక బీజేపీ ప్రభుత్వం బలం లేకున్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని.. వెంటనే బలనిరూపణ చేపట్టేలా ఆదేశించాలని సుప్రీంకోర్టును శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఆశ్రయించారు. మహారాష్ట్ర గవర్నర్ ఈనెల 30 వరకు గడువు ఇచ్చారని..దాని వల్ల బీజేపీ బేరసారాలకు దిగుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి.
రెండు మూడు రోజులుగా సుప్రీం కోర్టులో జరుగుతున్న ఈ వాదప్రతివాదనలకు తెరదించుతూ సుప్రీం కోర్టు ఈరోజు సంచలన తీర్పును ఇచ్చింది. మహారాష్ట్రలో కొలువుదీరిన సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సర్కారు అసెంబ్లీలో ఈనెల 27న అంటే రేపు బలనిరూపణ చేసుకోవాలని సంచలన ఆదేశాలు ఇచ్చింది. సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పుతో ఇప్పుడు మహారాష్ట్రలో వేడి పుట్టింది.
ఇప్పటికే బీజేపీ - ఎన్సీపీ నేత అజిత్ పవార్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎన్సీపీ నుంచి ఫిరాయించిన అజిత్ పవార్ వెంట కేవలం నలుగురు మాత్రమే ఎమ్మెల్యేలు మిగిలారు. మిగతా వారంతా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ గూటికి చేరారు. ఇక కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన బలం 160కు పైగా చేరింది. ఈ మూడు పార్టీలు తాజాగా ఎమ్మెల్యేలతో బలనిరూపణ ర్యాలీ కూడా ముంబై గవర్నర్ ఎదుట తీశారు.
ఇక మహారాష్ట్ర లో గద్దెనెక్కిన బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేల బలంతోపాటు అజిత్ పవార్ తో కలిపి నలుగురు ఎమ్మెల్యేల సాయంతో 109 సంఖ్యా బలం ఉన్నట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర లో బీజేపీ ప్రభుత్వం నిలబడాలంటే మేజిక్ మార్క్ 145. ఎన్సీపీ - కాంగ్రెస్ - శివసేన ఎమ్మెల్యేలు ఫ్లేట్ ఫిరాయించి బీజేపీకి మద్దతు తెలుపుతేనే బీజేపీ సర్కారు నిలబడుతుంది. లేదంటే కుప్పకూలడం ఖాయం. మరి బీజేపీ ఎలాంటి ప్రలోభాలకు గురిచేస్తుందనేది హాట్ టాపిక్ గా మారింది. రేపటి బలనిరూపణలో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పుతో యావత్ దేశవ్యాప్తంగా నెలకొంది.