Begin typing your search above and press return to search.

ప్రైవేటు ఆసుప‌త్రుల‌కు సుప్రీం షాక్!

By:  Tupaki Desk   |   9 July 2018 8:32 AM GMT
ప్రైవేటు ఆసుప‌త్రుల‌కు సుప్రీం షాక్!
X
షాకింగ్ వ్యాఖ్య‌లు చేసింది దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం. ప్రైవేటు ఆసుప‌త్రుల‌పై సుప్రీంకోర్టు చేసిన తాజా వ్యాఖ్య‌లు కొత్త క‌ల‌క‌లానికి తెర తీస్తున్నాయి. ప్ర‌భుత్వం నుంచి భూములు తీసుకొని నిర్వ‌హ‌ణ‌ను చేప‌ట్టిన ఆసుప‌త్రిలో సామాన్యుల‌కు ఉచిత వైద్యాన్ని అందించ‌టం త‌ప్ప‌నిస‌రి అని స్ప‌ష్టం చేసింది.

పేద‌ల‌కు ఉచిత వైద్యం అందించాల్సిందేన‌ని తేల్చిన సుప్రీం.. ప్ర‌భుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్ర‌కారం.. బ‌ల‌హీన వ‌ర్గాల‌కు చెందిన రోగుల‌కు వైద్య సేవ‌లు అందించాల‌ని ఆదేశాలు జారీ చేసింది. పేద రోగుల‌కు ఎన్ని బెడ్స్ ఇస్తున్నార‌న్న విష‌యంపై ప్ర‌భుత్వంతో చేసుకున్న ఒప్పందాన్ని ప్రైవేటు ఆసుప‌త్రులు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ రూల్స్ ను ఉల్లంఘించ‌కూడ‌ద‌న్నారు.

ఒక‌వేళ అలాంటి ప‌ని చేస్తే కోర్టు ధిక్కారం కింద ప్రైవేటు ఆసుప‌త్రుల మీద చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. అంతేకాదు.. పేద రోగుల‌కు ప్రైవేటు ఆసుప‌త్రుల్లో ఉచిత వైద్యం అందిస్తున్నారా? లేదా? అన్న విష‌యాన్ని స్వ‌యంగా ప‌ర్య‌వేక్షించ‌నున్న‌ట్లు సుప్రీం వెల్ల‌డించింది. దీనికి సంబందించి త‌మ‌కు ఎప్ప‌టిక‌ప్పుడు నివేదిక‌లు అంద‌జేయాల‌ని కోరింది. ఇందుకు సంబంధించి ఢిల్లీ ప్ర‌భుత్వానికి నివేదిక‌ల కోసం ఆదేశాలు జారీ చేసింది.

ప్ర‌భుత్వ స్థ‌లాల్ని తీసుకొని నిర్మించిన ప్రైవేటు ఆసుప‌త్రుల వివ‌రాల్ని అంద‌జేయాల‌ని.. పేద రోగుల‌కు ఎన్ని బెడ్స్ కేటాయించార‌న్న విష‌యాన్ని త‌మ‌కు అంద‌జేయాల‌ని కోరిన‌ట్లుగా పేర్కొంది. తాజాగా సుప్రీం ఇచ్చిన తీర్పు ప్రైవేటు కార్పొరేట్ ఆసుప‌త్రుల‌కు షాకింగ్ గా మారుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.