Begin typing your search above and press return to search.
అమ్మ కట్టాల్సిన రూ.100కోట్ల మాటేమిటి?
By: Tupaki Desk | 16 Feb 2017 5:14 AM GMTఅక్రమాస్తులపై సుప్రీం తీర్పు వెల్లడించిన వెంటనే.. చాలామంది నోటి నుంచి వచ్చిన మాట.. ‘జయ చనిపోయి బతికిపోయారు’ అని. రెండేళ్ల క్రితం ముఖ్యమంత్రిగా ఉన్న వేళ.. వచ్చిన తీర్పుతో సీఎం పదవికి రాజీనామా చేసిన జయలలిత జైలుకు వెళ్లటం తెలిసిందే. అనంతరం సుప్రీంకోర్టుకు అప్పీల్ తో బయటకు వచ్చిన ఆమె.. మళ్లీ ముఖ్యమంత్రి కావటం.. సార్వత్రికఎన్నికల్లో ఘన విజయంతో మరోసారి సీఎం కావటం తెలిసిందే. అనారోగ్యంతో మరణించిన ఆమెను సైతం తాజా తీర్పులో దోషిగా నిర్ధారించిన విషయాన్ని మర్చిపోకూడదు. చనిపోవటంతో ఆమెకు విధించిన జైలుశిక్ష అమలు కాదు.
మరి.. ఆమెకు విధించిన రూ.100కోట్ల జరిమానా? మాటేమిటి? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. కింది కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఖరారు చేసిన నేపథ్యంలో అమ్మకు వేసిన రూ.100కోట్ల జరిమానాను చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. అమ్మకు వారసులంటూ ఎవరూ లేని వేళ.. ఈ భారీ మొత్తాన్ని ఎవరు చెల్లిస్తారు? ఎలా చెల్లిస్తారు? అన్నది సందేహంగా మారింది.
అదే సమయంలో శిక్షల్ని ఖరారు చేసిన సుప్రీంకోర్టు తానిచ్చిన 570 పేజీల తీర్పులోనూ జరిమానాను ఎలా వసూలు చేయాలన్న అంశాన్ని ప్రస్తావించకపోవటం గమనార్హం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. దోషులకు చెందిన ఆరు కంపెనీలను స్వాధీనం చేసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఇది వారికి విధించిన జరిమానాకు అదనమన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఈ నేపథ్యంలో అమ్మకు విధించిన రూ.100కోట్ల మాటేమిటి? అన్నది పెద్ద ప్రశ్నగా మారిందని చెప్పాలి.
జయలలిత మరణించటంతో ఆమెకు విధించాల్సిన శిక్షను మాత్రమే నిలిపివేశారని.. ఆమెకు విధించిన రూ.100కోట్ల జరిమానానురద్దు చేయలేదని చెబుతున్నారు. దీనిపై న్యాయనిపుణుల మాటేమిటన్నది చూస్తే.. కోర్టు విధించిన జరిమానాను జయ ఎస్టేట్ లోని ఆస్తులను అమ్మటం ద్వారా ప్రభుత్వం తీసుకోవచ్చని చెబుతున్నారు.
జయలలిత మొత్తం ఆస్తుల విలువ రూ.100కోట్ల కంటే తక్కువ ఉంటే? అన్నది మరోప్రశ్న. ఈ కేసులో జయతో పాటు.. దోషులుగానిర్దించిన శశికళ.. ఇళవరిసి.. సుధాకరన్ లకు ఒక్కొక్కరికి రూ.10కోట్ల జరిమానాను విధించటం తెలిసిందే. ఈ మొత్తాన్ని ఎలా వసూలు చేస్తారన్న విషయానికి వస్తే.. వారికున్న స్థిర.. చరస్తుల్ని అమ్మటం ద్వారా.. కోర్టు వారికి విధించిన జరిమానాను వసూలు చేసే వీలుందని తెలుస్తోంది. చెప్పినంత తేలిగ్గా.. ఇలాంటివి జరిగిపోతాయా? అన్నది అసలు ప్రశ్న.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/