Begin typing your search above and press return to search.
ఫోన్ ట్యాపింగ్ తో అందరూ ఇరుక్కున్నట్లే
By: Tupaki Desk | 24 July 2015 1:20 PM GMTతెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వంతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిస్థాయిలో ఇరుక్కునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ తమ జుట్టును సుప్రీం కోర్టు చేతిలో పెట్టినట్లు కనిపిస్తోంది. ఇకనుంచి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సుప్రీం కోర్టు పర్యవేక్షించే అవకాశాలు ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వాలు అయినా ఫోన్ ట్యాపింగ్ ను అందరూ చేయడం సర్వ సాధారణం. మావోయిస్టులు, ఉగ్రవాదుల కదలికలు.. వారి ఆనుపానులను తెలుసుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ తప్పనిసరి. వాస్తవానికి, దేశ భద్రత కోణంలోనే ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడతారు. కానీ, కొద్ది కాలంగా రాజకీయ ప్రత్యర్థుల వ్యూహ ప్రతివ్యూహాలను తెలుసుకోవడానికి దీనిని ఉపయోగిస్తున్నారు. యూపీఏ హయాంలో కేంద్ర ప్రభుత్వంపైనా తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయి. ఈ వివాదం ముమ్మరం కావడం.. సుప్రీం కోర్టు మెట్లు కూడా ఎక్కిన నేపథ్యంలో అప్పట్లోనే సుప్రీం కోర్టు ఫోన్ ట్యాపింగ్ పై ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెరపైకి వచ్చిన వెంటనే కూడా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిపై కోర్టు మెట్లు ఎక్కవద్దని, దీనిని పెద్ద వివాదంగా చేసుకోవద్దని అంతర్గతంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలకూ సూచించింది. ఈ వివాదంతో కోర్టు మెట్లు ఎక్కితే అంతిమంగా ఇది మళ్లీ సుప్రీం కోర్టుకు చేరుతుందని, దాంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం న్యాయస్థానం పరిధిలోకి వెళ్లిపోతాయని ఆందోళన వ్యక్తం చేసింది. అయినా రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ వినిపించుకోలేదు. ఏపీ సర్కారు విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే.. తెలంగాణ ప్రభుత్వ బెదిరింపు ధోరణి కారణంగా మొండిగా వ్యవహరించిన సర్వీసు హైకోర్టుకు, సుప్రీం కోర్టుకు వెళ్లారు.
ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ పై సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేస్తే.. మావోయిస్టులు, ఉగ్రవాదుల ఫోన్లను ట్యాపింగ్ చేసే అవకాశం కూడా ప్రభుత్వాలకు ఉండే అవకాశం ఉండదేమోననే ఆందోళన నెలకొంది.