Begin typing your search above and press return to search.
పెగాసస్ పై సుప్రీంకోర్టు కీలక విచారణ
By: Tupaki Desk | 17 Aug 2021 8:30 AM GMTప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న పెగాసస్ పై భారత్ లోనూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లోనూ పెగాసస్ విషయంపై అట్టుడుకింది. దీనిపై చర్చించాలని ప్రతిపక్షాలు ఆందోళనలు చేశాయి. బెంచీపై ఎక్కి మరీ కొందరు సభ్యులు నిరసన తెలిపినా కేంద్రం మాత్రం ‘ఆ ఒక్కటి అడక్కు’ అన్న తరహాలో సమాధానం ఇచ్చింది. పెగాసస్ తప్ప మరేదానిపైనా చర్చిస్తామని సమాధానం ఇచ్చింది. అయితే దీనిపై కొందరు సుప్రీంలో పిటిషన్ వేసిన విషయం తెలిసింది. సోమవారం కేంద్ర తరుపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా రెండు పేజీల అఫిడవిట్ దాఖలు చేశారు. కానీ దీనిపై సుప్రీం అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో ఈ విచారణనను నేటికి వాయిదా వేసింది.
పర్సనల్ విషయాలను కేంద్రం అక్రమంగా తెలుసుకుంటుందని, ఇందుకు పెగాసస్ సాఫ్ట్ వేర్ వాడుతుందని దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. కొంతమంది ప్రముఖులు సైతం తమ ఫోన్ ట్యాపింగ్ కు గురయ్యాయని బాహటంగానే విమర్శించారు. అయితే కేంద్రం మాత్రం పెగాసస్ పై ఏ విధంగా స్పందించడం లేదు. దీంతో కొందరు పెగాసస్ పై స్పష్టత ఇవ్వాలని సుప్రీం కోర్టులో పిటిషన్లు వేశారు. అయితే సోమవారం కేంద్రం తరుపున ప్రవేశపెట్టిన అఫిడవిట్ స్పష్ట లేదని సుప్రీం వ్యాఖ్యానించింది. మీరు చెప్పదలుచుకున్నది అఫిడవిట్లో స్పష్టంగా పేర్కొనాలని తెలిపింది.
ఈ సందర్భంగా కేంద్రం తరుపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. చిన్న విషయాన్ని పెద్దగా చేస్తూ రాద్ధాంతం చేయాలని చూస్తున్నారన్నారు. అటు పిటిషనర్ల తరుపున జరిగిన వాదనలకు రెండు గంటలసమయం పట్టింది. ఇరువురి వాదన విన్న జస్టిస్ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ అనిరుద్ధ బోస్ లతో కూడాని త్రిసభ్య ధర్మాసనం విచారణ నేటికి వాయిదా వేసింది. ఈ సందర్భంగా జస్టిస్ రమణ మాట్లాడుతూ ‘మంగళవారం ఇదే అఫిడఫిట్ దాఖలు చేస్తారా..? లేకా దీనిని మారుస్తారా..? మారుస్తే మాకు చెప్పండి.. మరోసారి వాదనలు వింటాం. అయితే అదనపు అపిఢవిట్ దాఖలు చేస్తే మేం ఏమీ చేయలేం’ అని అన్నారు.
ఇజ్రాయెల్ దేశానికి చెందిస పెగాసేస్ స్పైవేర్ ద్వారా తమ భద్రత కోల్పోతున్నామని చాలా మంది ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు తమ సమాచారం తస్కరించారని ఆరోపించారు. ఇక పెగాసస్ స్పైవేర్ పై సిట్ ద్వారా విచారించాలని సీనియర్ జర్నలిస్టులు ఎన్. రామ్, శశికుమార్, ఎడిటర్ గిల్డ్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్టులో వ్యాజ్యాలు వేశారు. వీటిపై విచారణ జరుపుతున్నారు. దీనిపై వివరణ ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది. దీంతో ఎస్ జీ రెండు పేజీల అఫిడవిట్ ను సోమవారం దాఖలు చేసింది.
కానీ కేంద్రం తరుపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఇచ్చిచన అఫిడవిట్ పై సుప్రీం అసంతృప్తి చెందింది. పిటిషనర్లు అడిగిన ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం ఇవ్వాలని, ఆ సమాధానాన్ని అఫిడవిట్లో సమర్పించాలని తెలిపింది. మంగళవారం స్పష్టమైన సమాధానాలతో రావాలని తెలిపింది. అయితే తాము అడిగిన ప్రశ్నలకు కేంద్రం సరైన సమాధానం ఇవ్వలేదని పిటిషనర్ల తరుపున న్యాయవాది కపిల్ సిబల్ అన్నారు. అసలు పెగాసస్ స్పైవేర్ వాడారా..? లేదా..? అనే విషయాన్ని స్ఫష్టంగా చెప్పకుండా దాటవేస్తున్నారన్నారు. కేంద్రం పెగాసస్ ను వాడలేదని స్పష్టంగా చెప్పాలన్నారు. అయితే కమిటీల పేరుతో కాలయాపన చేస్తే ఊరుకోమన్నారు. కొంతమంది వినియోగదారులపై స్పైవేర్ ప్రయోగించినట్లు కేంద్రం చెప్పిందని, అయితే ఈ విషయం వారికి ఎలా తెలిసిందని అన్నారు. దీనిపై ఫ్రాన్స్ ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశిస్తే కేంద్రం మాత్రం ఏం తెలియనట్లు వ్యవహరిస్తోందని అన్నారు. ఓ మంత్రి తాము పెగాసస్ ను ఉపయోగించలేదని స్పష్టంగా చెప్పలేదని మరో న్యాయయవాది అన్నారు.